E-Paper
Advertisement

Christamas Movies 2024 : క్రిస్మస్ కు సందడి చెయ్యబోతున్న టాలీవుడ్ మూవీస్ ఇవే..

Christamas Movies 2024 : క్రిస్మస్ కు సందడి చెయ్యబోతున్న టాలీవుడ్ మూవీస్ ఇవే..
Advertisement

Christamas Movies 2024 : ప్రతి పండగకు సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు తెలుగులో సినిమాలు ఎక్కువగా పండగలకే విడుదల అవుతాయి. దసరాకు సినిమాల సందడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాగానే సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న కలెక్షన్స్ పరంగా బాగానే రాబట్టి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక అందరి చూపు క్రిస్మస్ కానుకగా విడుదల అవుతున్న సినిమాల పై పడింది. ఇక ఆలస్యం ఎందుకు ఈ క్రిస్మస్ కు విడుదల కాబోతున్న సినిమాలు ఏవో ఒక లుక్ వేద్దాం పదండి..

తండేల్ ..

Advertisement

నాగ చైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. వాస్తవిక సంఘనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో పాటుగా సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా మొదటగా సంక్రాంతికి రాబోతుందని అనౌన్స్ చేసిన ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు డేట్ ను లాక్ చేసుకుంది.

రాబిన్ హుడ్ ..

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘రాబిన్ హుడ్డ్’. ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా, నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా తప్పుకోవడంతో ఈ మూవీ డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

సారంగపాణి జాతకం ..

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి, రూప కొడుయూర్‌ జంటగా నటిస్తు న్నారు. ‘జెంటిల్‌మన్‌’, ‘సమ్మోహనం’ చిత్రాల తర్వాత మోహన కృష్ణ, శివలెంక కాంబినేషన్‌లో రూపొందుతున్నసినిమా ఇది .. ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మ్యాజిక్ ..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో VD12 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ కన్నా ముందే గౌతమ్ డైరెక్ట్ చేసిన ఓ చిన్న సినిమా రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్‌’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అప్డేట్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది . ఈ సినిమా డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది..
ఈ సినిమాలన్నీ డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా రాబోతున్నాయి. ఈ సినిమాలల్లో ఏ సినిమా హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×