E-Paper
Advertisement

Director Vamsee Krishna: పెళ్లిపీటలు ఎక్కిన రవితేజ డైరెక్టర్.. వధువు ఎవరంటే.. ?

Director Vamsee Krishna: పెళ్లిపీటలు ఎక్కిన రవితేజ డైరెక్టర్.. వధువు ఎవరంటే.. ?
Advertisement

Director Vamsi Krishna: టాలీవుడ్ డైరెక్టర్ వంశీకృష్ణ  ఒక ఇంటివాడయ్యాడు. నేడు వంశీకృష్ణ వివాహం ఘనంగా  జరిగింది. ప్రమీల అనే యువతితో ఆయన పెళ్లి .. ఇరు కుటుంబ పెద్దలు, అత్యంత సన్నహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  వీరి వివాహానికి అభిషేక్ అగర్వాల్ తో పాటు పలువురు  ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇక వంశీకృష్ణ కెరీర్ గురించి చెప్పాలంటే..  2015 లో అడివి శేష్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన దొంగాట సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక రెండేళ్ల గ్యాప్ తరువాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ చిత్రం  పాజిటివ్ టాక్ ను అందుకున్నా..  డైరెక్టర్ గా వంశీని నిలబెట్టలేకపోయింది.

Advertisement

ఇక వంశీ  లక్ మార్చిన సినిమా అంటే టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. స్టువర్టుపురం  గజదొంగ టైగర్ నాగేశ్వరావు బయోపిక్ గా ఈ సినిమాను వంశీ తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో రీసెర్చ్ చేసినట్లు  ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా వంశీకి విజయాన్ని అందించలేకపోయింది.

రవితేజ లుక్, టేకింగ్, రేణు దేశాయ్ రీఎంట్రీ  ఇచ్చినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొన్ని కొన్ని సీన్స్ అసలు నిజం కాదు అని ప్రేక్షకులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఆ సినిమా తరువాత వంశీ ఇదుగో ఇప్పుడు ఇలా పెళ్లి కొడుకులా కనిపించాడు.   ప్రస్తుతం వంశీ మంచి కథలను రాసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ డైరెక్టర్ ఏ హీరోలను మెప్పించి హిట్ అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×