E-Paper
Advertisement

Swag: సోషల్ మీడియాను షేక్ చేసిన సింగా ఎవరో తెలిసిపోయింది

Swag: సోషల్ మీడియాను షేక్ చేసిన సింగా ఎవరో తెలిసిపోయింది
Advertisement

Swag: గత రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సింగా వీడియో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. సింగా వస్తున్నాడు అంటూ ఒక వ్యక్తి ముఖాన్నీ మొత్తం కవర్ చేసుకొని.. సింగా మీమర్ అయితే.. సింగా రివ్యూయర్ అయితే.. సింగా ఇన్ఫ్లుయెన్సెర్ అయితే అని.. ఫేమస్ డైలాగ్స్ చెప్తూ కనిపించాడు.

ఇక దీంతో అసలు ఎవడు ఈ సింగా. కొత్త హీరోనా.. ? ఏ సినిమాకు ప్రమోట్ చేస్తున్నాడు అనేది తెలియక అభిమానులు తలలు పట్టుకున్నారు. ఇక ఎట్టకేలకు సింగా ఎవరో తెలిసిపోయింది. సింగా ఎవరో కాదు హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం స్వాగ్. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.

Advertisement

ఇక ఈ చిత్రంలో రీతువర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. దాని కోసమే సింగా వస్తున్నాడు అనే హ్యాష్ ట్యాగ్ తో ఆ వీడియోను రిలీజ్ చేసి ట్రెండ్ చేశారు.

ఇక సింగారో సింగ అంటూ సాగే సాంగ ను జూలై 18 న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సింగర్ బాబా సెహగల్ తో సింగా అంటూ చెప్పుకొస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీవిష్ణు ఫేస్ ను కళ్లవరకు మాత్రమే చూపిస్తూ సింగా ఎవరో ఇంకా దాచిపిట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సింగా శ్రీవిష్ణునా.. ? కాదా.. ? అనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×