E-Paper
Advertisement

Today OTT Releases Movies And Series: ఇవాళ ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలంటే..?

Today OTT Releases Movies And Series: ఇవాళ ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలంటే..?
Advertisement

Today OTT Releases Movies And Series: ప్రస్తుతం థియేటర్లలో ఒక్క కల్కి మూవీ తప్పించి మరే పెద్ద సినిమాలు లేవు. దీంతో చాలా మంది ఓటీటీలలో వచ్చే సినిమాల కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఇందులో బాగంగానే ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్ ప్రైమ, ఆహా, నెట్‌ఫ్లిక్స్ వంటివి కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు కొన్ని స్ట్రీమింగ్ అయ్యాయి. మరికొన్ని ఇవాళ అంటే శుక్రవారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)

Advertisement

స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం). ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయి మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినమా ఇవాళ్టి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

బహిష్కరణ

Advertisement

ఇటీవల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నటించి అదరగొట్టేసిన నటి అంజలి ఇప్పుడు కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. అంజలి కీలక పాత్రలో నటించిన కొత్త సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో ఈ సిరీస్ రివేంజ్ థ్రిల్లంగ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సిరీస్ జూలై 19 అంటే ఇవాళ్టి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: బాలీవుడ్ క్రిటిక్స్‌పై పరువు నష్టం దావా వేసిన కల్కి టీం..! కారణం ఇదే..?

బూమర్ అంకుల్

తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు, రోబో శంకర్, ఓవియా లీడ్ రోల్‌లో నటించిన కొత్త సినిమా ‘బూమర్ అంకుల్’. స్వదీస్ ఎమ్ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ఈ సినిమా జూలై 20 అంటే శనివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్

జూలై 19 – స్కై వాకర్స్ : ఏ లవ్‌స్టోరీ (ఇంగ్లీష్)

జూలై 19 – ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లీష్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

జూలై 19 – నాగేంద్రన్స్ హనీమూన్ (మలయాళ వెబ్ సిరీస్)

జీ 5

జూలై 19 – బర్జాఖ్ (హిందీ వెబ్ సిరీస్)

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×