E-Paper
Advertisement

Vaarasudu OTT date : వార‌సుడు ఓటీటీ డేట్‌… ప్లాన్ మార్చేసిన దిల్ రాజు

Vaarasudu OTT date : వార‌సుడు ఓటీటీ డేట్‌… ప్లాన్ మార్చేసిన దిల్ రాజు
Advertisement

Vaarasudu OTT date : ద‌ళ‌ప‌తి విజ‌య్ లేటెస్ట్ మూవీ వార‌సుడు (వారిసు). తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేయాల‌ని భావించిన దిల్‌రాజు ప్రయ‌త్నాల‌కు చిరంజీవి, బాల‌కృష్ణ అడ్డుప‌డ్డారు. దీంతో వారిసుని త‌మిళంలో జ‌న‌వ‌రి 11న రిలీజ్ చేస్తే వార‌సుడుని తెలుగులో జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయాల్సి వ‌చ్చింది. ఇది నిజంగా దిల్ రాజుకి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే కానీ త‌ప్ప‌లేదు. ఏదైతేనేం వార‌సుడు తెలుగు, త‌మిళంలో ఒకేసారి రిలీజ్ కాలేదు. సినిమా కూడా ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ దక్కించుకోలేదు. సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాగానే రాబ‌డుతోంది. ఇప్ప‌టికే వార‌సుడు సినిమా తెలుగు, త‌మిళ వెర్ష‌న్స్‌లో క‌లిపి రూ.200 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

కాగా తాజాగా వార‌సుడు సినిమా విష‌యంలో నెట్టింట మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే వారిసు ఓటీటీ రిలీజ్ డేట్. సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. వ‌చ్చే క‌లెక్ష‌న్స్ జ‌న‌వ‌రితో దాదాపు పూర్త‌వుతాయి. దీంతో డీల్ కంటే ముందుగానే వార‌సుడు సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. సాధార‌ణంగా సినిమా రిలీజైన 8 వారాల త‌ర్వాతే ఓటీటీలోకి విడుద‌ల చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ప‌రిస్థితుల్లోనే ముందుగా రిలీజ్ చేసుకోవ‌చ్చు. అది నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు ఇబ్బంది లేన‌ప్పుడు. అలాంటి ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లోనే దిల్ రాజు వార‌సుడు సినిమాను ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ న్యూస్ నిజ‌మ‌వుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Follow this link for more updates : Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×