E-Paper
Advertisement

Venkaiah Naidu: కల్కిపై వెంకయ్య నాయుడు ప్రశంసలు..

Venkaiah Naidu: కల్కిపై వెంకయ్య నాయుడు ప్రశంసలు..
Advertisement

Venkaiah Naidu: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అబితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించగా.. రాజమౌళి, విజయ్ దేవరకొండ, ఆర్జీవీ, మృణాల్ ఠాకూర్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు.

ఎన్నో అంచనాల నడుమ జూన్ 27 న రిలీజ్ అయిన కల్కి.. భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. 1000 కోట్ల క్లబ్ లో చేరినా.. ఇంకా థియేటర్ లో విజయవంతంగా కొనసాగుతూనే ఉంది.

Advertisement

ఇక ఈ సినిమాపై ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెల్సిందే. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అని తేడా లేకుండా.. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కల్కిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా రాజకీయ నేత M. వెంకయ్య నాయుడు సైతం కల్కిని వీక్షించి తన అనుభూతిని తెలిపారు.

” శ్రీ నాగ్ అశ్విన్ గారి దర్శకత్వంలో శ్రీ అశ్వినీ దత్ గారు నిర్మించిన కల్కి 2898 ఎ.డి చలనచిత్రాన్ని ఈరోజు వీక్షించాను. మహాభారత ఇతిహాసం స్ఫూర్తితో, మహాభారతంలోని పాత్రలతో రూపొందించిన ఈ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని కలిగించింది. సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఈ సినిమాని నిర్మించారు.

Advertisement

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే తదితర భారీ తారాగణంతో రూపొందించిన ఈ చలనచిత్ర నిర్మాణం హాలీవుడ్ నిర్మాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా. దర్శకుడు శ్రీ నాగ్అశ్విన్, నిర్మాత శ్రీ అశ్వినీ దత్ సహా ఈ చలనచిత్ర రూపకల్పనలో పాల్పంచుకున్న భాగస్వాములందరికీ అభినందనలు” అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×