E-Paper
Advertisement

Venkat Boyanapalli: ఆ ఇద్దరితో మల్టీస్టారర్ సినిమా నా కల

Venkat Boyanapalli: ఆ ఇద్దరితో మల్టీస్టారర్ సినిమా నా కల
Advertisement

Venkat Boyanapalli: సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘సైంధవ్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ చిత్ర నిర్మాత వెంకట్‌ బోయనపల్లి తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఈ మేరకు ఆయనకు టాలీవులో ఇద్దరు హీరోలు ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా ఆయన తొలి సినిమాగా వాళ్లిద్దరినీ కలిపి ఓ మల్టీస్టారర్‌ చేయాలనుకున్నట్లు తెలిపారు. అలా కుదరకపోవడంతో ఇప్పుడు వెంకటేశ్‌ 75వ సినిమాని నిర్మించే అవకాశం తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని.. అది అతని అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. అయితే ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేశ్‌లు.

నాని తనను నిర్మాతని చేశారని అన్నారు. ఆయనతో సినిమాలు చేశాక.. మరో ఇష్టమైన హీరో వెంకటేశ్‌తో సినిమా చేశానని తెలిపారు. అయితే ఆ ఇద్దరితో కలిపి ఓ మల్టీస్టారర్ సినిమా తీయాలనే తన కల నెరవేరలేదు అని అన్నారు. కానీ, అది ఎవరు తీసినా తనకు ఇష్టమేనంటూ చెప్పారు. వాళ్లిద్దరి కోసం తానుకూడా కథల్ని వెదుకుతున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ చేస్తే ఇంకా సంతోషిస్తానని అన్నారు. ఇష్టమైన హీరోలు.. దర్శకులతో కలిసి సినిమాలు చేయడంలో ఉన్న ఆ ఆనందమే వేరు అని అన్నారు. ఇక నానితో ‘కృష్ణార్జున యుద్ధం’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చేశాక.. ఇప్పుడు వెంకటేశ్‌తో ‘సైంధవ్‌’ నిర్మించానని తెలిపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×