E-Paper
Advertisement

VenkyAnil3: ఇన్ని ఎక్స్ లు ఏంటి.. వెంకీ మామ

VenkyAnil3: ఇన్ని ఎక్స్ లు ఏంటి.. వెంకీ మామ
Advertisement

VenkyAnil3: విక్టరీ వెంకటేష్ జోరు పెంచేశాడు. ఈ ఏడాది సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ మామ.. ప్రేక్షకులను నిరాశపరిచాడు. కానీ, ఈసారి మాత్రం గట్టి హిట్ కొట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే తనతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో మూడోసారి జత కట్టాడు. వీరి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రానుంది. ఉగాది పండుగవేళ మేకర్స్ ఈ కాంబోను అధికారికంగా ప్రకటించారు. ట్రయాంగిల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియోలో.. ఎక్స్ కాప్ .. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. ఎక్సలెంట్ వైఫ్ అని చెప్పి హైప్ తెచ్చిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 3 న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది మేకర్స్ అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

Advertisement

ఇక ఈ పోస్టర్ లో.. ఒక గన్, దాని మీద తాళి, దానిపక్కనే రోజా పువ్వును చూపించారు. అంతేకాకుండా ఎక్సలెంట్ వైఫ్/ఎక్స్ కాప్/ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటివరకు కామెడీ సినిమాలతో హిట్స్ అందుకున్న అనిల్.. తన పంథా మర్చి బాలయ్యతో భగవంత్ కేసరి తెరకెక్కించాడు. అది బాలయ్య మాస్ యాక్షన్ తో కొట్టుకుపోయింది.

ఇక ఇప్పుడు వెంకీ మామ రివెంజ్ థ్రిల్లర్ అంటే ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవాల్సిందే. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఇన్ని ఎక్స్ లు ఏంటి.. వెంకీ మామ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఎక్స్ ల గురించి తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×