BigTV English

Venom The Last Dance Telugu Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న తెలుగు ట్రైలర్.. చూడకుండా ఉండలేరు

Venom The Last Dance Telugu Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న తెలుగు ట్రైలర్.. చూడకుండా ఉండలేరు

VENOM: THE LAST DANCE Telugu Trailer: హాలీవుడ్ మార్వెల్ మూవీలకు ఇండియాలో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హాలీవుడ్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి ఎక్కువగా ఫ్రాంచైజీ చిత్రాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక.. సెకండ్ పార్ట్‌పై మరింత బజ్ క్రియేట్ అవుతుంది. అదే హైప్‌తో సెకండ్ పార్ట్‌ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక మూడో పార్ట్‌ వైపు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.


అలాంటి తరహాలు ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగులో వచ్చి హిట్లు మీద హిట్లు కొట్టాయి. ఇప్పుడు అలాంటిదే మరోకటి హాలీవుడ్ మార్వెల్ మూవీస్‌ నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. అదే ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పార్టులు హై క్లాస్‌గా హిట్లు అందుకున్నాయి. ఈ రెండు పార్టులు ఇండియన్ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఏదైనా ఒక యాక్షన్ సీన్ లేదా మరేదైనా ఇన్సిడెంట్ జరిగినపుడు ఒక మనిషి జంతువుగా మారడం, అది పూర్తయ్యాక మళ్లీ మనిషి రూపంలోకి రావడం వంటి సన్నివేశాలు సినీ ప్రియుల్లో సరికొత్తగా అనిపించాయి.

మొదటిగా ‘వెనమ్’ 2018లో వచ్చి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత 2021లో ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ సీక్వెల్ వచ్చి మరింత బజ్‌తో దుమ్ము దులిపేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండియన్ సినీ ప్రియులు సైతం ఈ రెండు పార్టులకు ఫిదా అయిపోయారు. దీంతో మూడో పార్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ థర్డ్ పార్ట్ కూడా పట్టాలెక్కి చాలా కాలమే అయింది. అయినా ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో అటు హాలీవుడ్ ప్రియులతో పాటు ఇండియన్ ప్రియులు సైతం నిరాశలో ఉన్నారు.


Also Read: నాని వదులుకున్న ‘ఎల్లమ్మ’కు ఆ కుర్రహీరో గ్రీన్ సిగ్నల్..!

ఈ నేపథ్యంలో వారిని సర్‌ప్రైజ్ చేస్తూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ ఫ్రాంచైజీ మూవీ నుంచి మరో సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ పేరుతో రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌ అత్యద్భుతంగా ఉంది. ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసింది. నటుడు టామ్ హర్డీ తన యాక్టింగ్‌తో దుమ్ము దులిపేశాడు. వెనమ్ పాత్రలో యాక్షన్ సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కెల్లి మార్సెల్ తన క్రియేటివిటీతో ట్రైలర్‌ను కట్ చేయించి సినీ ప్రియులకు, అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాడు.

ఈ హాలీవుడ్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మార్వెల్ కలిసి నిర్మిస్తున్నాయి. అలాగే సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా భారతదేశంలో తెలుగు, హిందీ, తమిళం, 3డి, ఐమ్యాక్స్ 3డిలో రిలీ చేస్తుంది. ఇది అక్టోబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×