E-Paper
Advertisement

Yellamma: నాని నుంచి ఆ కుర్ర హీరో చేతికి చిక్కిన ఎల్లమ్మ.. బలగం వేణుకు ఇది కూడా మంచి ఆఫరే

Yellamma: నాని నుంచి ఆ కుర్ర  హీరో చేతికి చిక్కిన ఎల్లమ్మ.. బలగం వేణుకు ఇది కూడా మంచి ఆఫరే
Advertisement

Yellamma: బలగం సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు జబర్దస్త్ కమెడియన్ వేణు యేల్దండి. అసలు వేణు.. డైరెక్టర్, దిల్ రాజు కుమార్తె నిర్మాత అన్నప్పుడే సినిమాపై అంచనాలు పెరిగాయి. బలగం కథ చూసాక.. ప్రతి ఒక్కరు ఊరు.. పల్లెటూరు అని పాడుకోవడం మొదలుపెట్టారు. అంతేనా ఈ సినిమా చూసి అప్పటివరకు విడిపోయిన అన్నదమ్ములు కలిసిపోయారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

రికార్డ్ కలక్షన్స్ తో పాటు ఎన్నో అవార్డులను కూడా అందించిపెట్టింది. మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు వేణు. ఇక బలగం తరువాత అలాంటి కథనే ఒకటి రెడీ చేస్తున్నాడని అప్పట్లో టాక్ నడిచింది. అదే ఎల్లమ్మ. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే నాని ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నాని సైతం ఎల్లమ్మ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే ఎల్లమ్మ లైన్ నచ్చింది కానీ, వేణు చెప్పిన స్టోరీ నచ్చలేదని, నాని.. ఎల్లమ్మ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఎల్లమ్మ మళ్లీ హీరో కోసం వేచి చూస్తోంది. ఇక అందుతున్న సమాచారం ఎల్లమ్మ కథ.. శర్వానంద్ చేతికి చేరినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో శర్వా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. వేణు ఏమి ఎల్లమ్మ కథను ఒక హీరో అనుకోని రాయలేదు అంట. దీంతో హీరోను మార్చినా పెద్ద ప్రాబ్లెమ్ లేదని అంటున్నారు.

నిజం చెప్పాలంటే .. ఎల్లమ్మ అటు శర్వాకు.. ఇటు వేణుకు మంచి ఆఫర్. ప్రస్తుతం శర్వా విజయం కోసం పరితపిస్తున్నాడు. ఈ మధ్యనే క్లాస్ లుక్ లో మనమే లో కనిపించాడు. ఇప్పుడు ఎల్లమ్మ లో ఊర మాస్ లో కనిపిస్తే అతని రేంజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఇదే కనుక నిజమైతే త్వరలోనే ఎల్లమ్మ పట్టాలెక్కడం ఖాయం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×