E-Paper
Advertisement

Vijay Sethupathi:- పాలిటిక్స్‌పై విజ‌య్ సేతుప‌తి కామెంట్స్‌

Vijay Sethupathi:- పాలిటిక్స్‌పై విజ‌య్ సేతుప‌తి కామెంట్స్‌
Advertisement

Vijay Sethupathi:- కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఇటు ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత న‌టుడే. ఎలాంటి పాత్ర‌ల్లో అయినా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌టం ఆయ‌న స్టైల్‌. అందువ‌ల్లే లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా విజ‌య్ సేతుప‌తికి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. సాధారణంగా తన పని చేసుకుంటూ వెళ్లే ఈయన తాజాగా రాజ‌కీయాల‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అస‌లు ఇంత‌కీ ఈ మ‌క్క‌ల్ సెల్వ‌న్ పాలిటిక్స్ గురించి ఏమ‌న్నార‌నే వివ‌రాల్లోకి వెళితే,

త‌మిళ‌నాడు ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, డీఎంకే అధ్య‌క్షుడు ఎం.కె.స్టాలిన్ 70 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తేనాంపేట‌లో స్టాలిన్ 70 పేరుతో ఓ ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కి ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు వారిలో విజ‌య్ సేతుప‌తి కూడా ఉన్నారు. ఆయన రాజ‌కీయాల గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ‘ప్రస్తుత రాజకీయాలపై అవగాహన ఉంది. అలాగే యూత్ ఇప్పుడున్న రాజకీయ ప‌రిస్థితుల‌ను అవ‌గ‌తం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇప్పుడు సినిమాల‌తో బిజీగా ఉన్నాను. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆలోచ‌న ఇప్పుడైతే లేదు. భ‌విష్య‌త్తులో రాజకీయాల్లో వ‌స్తానో లేదో ఇప్పుడే ఎలా చెప్ప‌గ‌ల‌ను’’ అని అన్నారు మక్కల్ సెల్వన్.

Advertisement

కెరీర్ ప్రారంభంలో తమిళ సినిమాల్లో క్యారెక్టర్ యాక్ట‌ర్‌గా చేస్తూ త‌ర్వాత హీరోగా, విల‌న్‌గా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ప్ర‌ధాన పాత్ర‌ధారిగానూ క‌నిపిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా రీసెంట్ ఫ‌ర్జి వంటి వెబ్ సిరీస్ ద్వారా డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. తెలుగు విష‌యానికి వ‌స్తే ఉప్పెన, ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వంటి స్ట్ర‌యిట్ తెలుగు చిత్రాల్లో న‌టించిన విజ‌య్ సేతుప‌తి పుష్ప 2లోనూ క‌నిపించ‌బోతున్నారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వెర్సటైల్ యాక్టర్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కించబోయే సినిమాలోనూ హీరోగా నటిస్తారని సమాచారం.

‘దసరా’పై స్పందించిన మహేష్ బాబు.. ఏమన్నారంటే?

Advertisement

for more updates follow this link:-Bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×