E-Paper
Advertisement

Viswam: సెన్సార్ పూర్తి చేసుకున్న గోపీచంద్ మూవీ.. ఆ సన్నివేశాలు డిలీట్..!

Viswam: సెన్సార్ పూర్తి చేసుకున్న గోపీచంద్ మూవీ.. ఆ సన్నివేశాలు డిలీట్..!
Advertisement

Viswam.. ప్రముఖ టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand ) హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల (Srinu vaitla) దర్శకత్వంలో వస్తున్న చిత్రం విశ్వం (Viswam ). అక్టోబర్ 11వ తేదీన దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అలాగే సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. 2:36 గంటల నిడివితో విడుదల కాబోతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అంతేకాదు చిత్రాలయం స్టూడియోస్ కూడా ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది.

సెన్సార్ పూర్తి.. సక్సెస్ కోసం ఆరాటపడుతున్న టీం.

Advertisement

మరొకవైపు వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న గోపీచంద్ ఇటీవలే భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీనికి తోడు మరోపక్క డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా ఫ్లాప్ ఎదుర్కొంటూ.. ఉన్న ఫేమ్ కాస్త కోల్పోయాడు. ముఖ్యంగా ఈయన తెరకెక్కించిన ఆగడు ,బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్ గా నిలవడంతో సక్సెస్ అందుకోవడం కోసం పరితపిస్తున్నాడు.. ఈ నేపథ్యంలోనే అటు గోపీచంద్, ఇటు శ్రీనువైట్ల సక్సెస్ దిశగా అడుగులు వేయడానికి చేసిన తొలి ప్రయత్నంలో విశ్వం సినిమా తెరపైకి రానుంది. ఇక ఇందులో హీరోయిన్ కావ్య కాపర్ నటిస్తూ ఉండగా.. అటు ఈమెకు కూడా ఒక్క విజయం కూడా లేకపోవడం గమనార్హం. అలా ముగ్గురికి కూడా ఈ చిత్రం లైఫ్ అండ్ డెత్ గా నిలిచింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి లేకపోతే కెరియర్ లేదు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

టీజర్ తో సినిమాపై హైప్..

Advertisement

ఇప్పటికే విశ్వం సినిమా నుంచి విడుదలైన టీజర్ , ట్రైలర్ అన్ని కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సినిమాపై కొంచెం బజ్ ఏర్పడింది కానీ అసలు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనే విషయం అభిమానులలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా మరొక వైపు అక్టోబర్ 11వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా లో సెన్సార్ వారు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సెన్సార్ బోర్డు డిలీట్ చేసిన సన్నివేశాలు..

హీరో గోపీచంద్, హీరోయిన్ కావ్య థాపర్ మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సాంగ్ లో గ్లామర్ షో శృతిమించడంతో కొంచెం బ్లర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సినిమా మొదలైన తర్వాత 1:13:14 సమయం వద్ద ఒక విలన్ చేయి నరికే సన్నివేశం ఉంటుందంట. నరకబడిన చెయ్యిని చూపించకుండా కొంచెం ఫార్వర్డ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు సినిమాలో కొన్ని వైలెన్స్ సన్నివేశాలు ఉండడంతో వాటిని కూడా డిలీట్ చేయించిందట సెన్సార్ బోర్డ్.

అంతేకాకుండా ఒక డెడ్ బాడీ విజువల్ ని కూడా డిలీట్ చేశారని, అదే సీన్లో వచ్చే ఇంకొన్ని విజువల్స్ ని కూడా డిలీట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా మొత్తంగా కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి డిలీట్ చేసి సినిమాను విడుదల చేయబోతున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×