E-Paper
Advertisement

Salman Khan: ఆ హీరోయిన్ తో రొమాన్స్.. ఛీఛీ ఏం మాట్లాడుతున్నారు..

Salman Khan: ఆ హీరోయిన్ తో రొమాన్స్.. ఛీఛీ  ఏం మాట్లాడుతున్నారు..
Advertisement

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాల నడుమ విమర్శలకు గురైనా కూడా సల్లు భాయ్ వ్యక్తిత్వం వేరు. ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో కుర్ర హీరోయిన్లు రొమాన్స్ చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చిరంజీవి, రవితేజ లాంటివారితో వారికన్నా తక్కువ వయస్సు ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం చూసాం. ఆ సినిమాలపై విమర్శలు కూడా  వచ్చాయి.

తమ కూతురు వయస్సు ఉన్న హీరోయిన్స్ తో చేయడానికి హీరోలకు ఏమి అనిపించడం లేదా.. ? డైరెక్టర్స్.. హీరోయిన్ గా ఒక అమ్మాయి పేరు చెప్పినప్పుడు.. ఆమె వయస్సు,  తమ పక్కన ఎలా కనిపిస్తుంది అనేది చూడకుండా ఎలా ఒప్పుకుంటున్నారు.. అనే డౌట్ వస్తుంది. ఇక ఇంకొంతమంది అయితే.. మాకు కుర్ర హీరోయిన్లు మాత్రమే కావాలని డిమాండ్ చేసే హీరోలు కూడా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. అంతెందుకు .. శ్రీదేవి విషయంలో కూడా అదే జరిగింది.

Advertisement

ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన ఆమె.. వేటగాడు సినిమాలో అదే ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసింది. అప్పుడు ఎన్టీఆర్ కూడా ఇలాంటి ప్రశ్న వేశాడా.. ? లేదా.. ? అనేది వారికే తెలియాలి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే..  సల్లు భాయ్.. ఒక సినిమాలో తనకంటే చిన్న వయస్సులో ఉన్న హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి సంకోచించాడట. అది కూడా తన కళ్ల ముందు పెరిగిన అమ్మాయితో రొమాన్స్ ఏంటి అని డైరెక్టర్ మీద ఫైర్ కూడా అయ్యాడట. ఆ హీరోయిన్ ఎవరో కాదు సోనమ్ కపూర్.

సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా నటించిన చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయే. ఈ సినిమాలో సోనమ్ కపూర్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా  ఈ సినిమా తెలుగు వెర్షన్ లో సల్మాన్ ఖాన్ కు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం.   ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయిన.. సల్లు భాయ్ కు, సోనమ్ కపూర్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. అయితే మొదట సోనమ్ కపూర్ హీరోయిన్ అనగానే సల్మాన్ ఖాన్ డైరెక్టర్ పై ఫైర్ అయ్యాడట.

Advertisement

సోనమ్ కపూర్ తో రొమాన్సా.. ఛీఛీ ఏం మాట్లాడుతున్నారు.. ఆమె వయస్సు ఎక్కడ.. నా వయస్సు ఎక్కడ.. ?  చిన్న పిల్ల.  నా కళ్ల ముందు పెరిగిన అమ్మాయి.. ఆమెను నా ప్రేయసిగా  ఎలా అనుకోవాలి.. వద్దు, మార్చండి అని అన్నాడట.  ఇక డైరెక్టర్ ఏదో విధంగా సల్మాన్ ను ఒప్పించి ఈ సినిమాను పూర్తి చేయించాడట. సినిమా రిలీజ్ తరువాత కూడా వీరిపై ట్రోల్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ విషయం తెలియడంతో సల్మాన్ వ్యక్తిత్వాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×