E-Paper
Advertisement

NTR: టీడీపీ ఘన విజయం సాధించింది.. ఎన్టీఆర్ ఇంకా మౌనమా.. ?

NTR: టీడీపీ ఘన విజయం సాధించింది.. ఎన్టీఆర్ ఇంకా మౌనమా.. ?
Advertisement

NTR: టీడీపీ పని అయిపోయింది.. చంద్రబాబు కు వయస్సు పెరిగింది.. నారా లోకేష్ కు జ్ఞానం లేదు.. మళ్లీ ఎన్టీఆర్ వస్తే తప్ప టీడీపీకి దిక్కు లేదు. అప్పట్లో వైసీపీ నాయకులు అన్న మాటలు ఇవన్నీ. నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని.. ఆయన మృతి చెందాకా.. తన భుజ స్కందాలపై మోస్తూ వస్తున్నాడు చంద్రబాబు.

ఇక ఆయనకు తోడుగా నందమూరి ఫ్యామిలీ నిలబడింది. వైసీపీ గెలిచాకా.. టీడీపీ ని తొక్కేయడానికి చాలా ప్లాన్స్ వేశారు. కానీ, అవన్నీ కూటమి ఏర్పడక ముందు.. ఒక్కసారి పొత్తుగా ఏర్పడ్డాక.. చంద్రబాబు వెనుక పవన్ నిలబడ్డాడు. ఇక చంద్రసేనగా కూటమి ఏర్పడింది. ఎంత అణుకువగా ఉండే పవన్.. ఈసారి స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. పదేళ్లు ఎన్నో అవమానాలు, విమర్శలు.. ఎన్ని ఎదుర్కోవాలో అన్ని ఎదుర్కున్నాడు.

Advertisement

ఎట్టకేలకు నేడు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. అయితే ఇంత గొప్ప విజయం కూటమి సొంతం చేసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండడం టీడీపీ ఫ్యాన్స్ ను కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజకీయాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు.

ఒకప్పుడు టీడీపీకి ప్రచారం చేసిన తారక్.. ఇప్పుడు మాత్రం టీడీపీ విజయంపై కనీసం ఒక ట్వీట్ కూడా వేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు అంటున్నారు. కూటమి భారీ మెజారిటీతో గెలవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ, తారక్ మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నాడు.

Advertisement

కనీసం మర్యాదపూర్వకంగా అయినా శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. సరే.. ప్రచారానికి ముందు అంటే వేరు.. కానీ, ఇప్పుడు విజయాన్ని అందుకున్నందుకు అయినా తారక్ మౌనం వీడి శుభాకాంక్షలు తెలిపితే బావుంటుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి తారక్ టీడీపీ కి శుభాకాంక్షలు తెలిపే తరుణం ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×