E-Paper
Advertisement

Philippines: ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి ఊహించని విషాదం, ఏకంగా 1000కి పైగా

Philippines: ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి ఊహించని విషాదం, ఏకంగా 1000కి పైగా
Advertisement

Philippines: ఫిలిప్పీన్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ తీరప్రాంతమైన బొంగావోలో ప్రాంతం ఈ ఘటనకు వేదికైంది. ఓ ప్రాంతం అ కీలల్లో చిక్కుకుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎగసిపడ్డ మంటలు నిర్మించుకున్న నివాసాలను బూడిద కుప్పగా మార్చేసింది. దాదాపు వెయ్యికి పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దాదాపు 5 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది?

ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్నిప్రమాదం

Advertisement

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని తీర ప్రాంతం బొంగావోలో ఊహించిన విషాదం చోటు చేసుకుంది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ఆ ప్రాంతం బూడిద కుప్పగా మారింది. ఎటు చూసినా శిథిలాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకు ఓ ఇంట్లో ఎగసిపడ్డ మంటలు ఆ ఊరిని కమ్మేశాయి.

ఫలితంగా వెయ్యి ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 5 వేల మంది నిరాశ్రయులయ్యారు. మంటలకుతోడు పెనుగాలులకు బలంగా వీయడంతో మంటలు అన్నిప్రాంతాలకు వ్యాపించాయి. ఫలితంగా చుట్టుపక్కల ఇళ్లకు అంటుకున్నాయి. ఎగసిపడిన మంటలను చూసి ఇళ్ల జనం బయటకు పరుగులు తీశారు. చెప్పకోవాలంటే రాత్రి వేళ ఘటన జరగడంతో భారీగా ప్రాణనష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.

Advertisement

దగ్దమైన 1000 ఇళ్లు.. ఐదువేల మంది నిరాశ్రయులు

కొందరు భయపడి సముద్రంలోకి దూకేసి తమ ప్రాంతాలను కాపాడుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఆ ప్రాంతం కాలి బూడిదైంది. బాధితులను రెస్క్యూ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించారు. మృతుల సంఖ్య ఇలా తెలియాల్సివుంది.

చాలా కుటుంబాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పారిపోయాయి. కనీసం ఇంట్లోని వస్తువులు తీసుకోలేని పరిస్థితి వాళ్లది. ఒక్కమాటలో చెప్పాలంటే సర్వం బుగ్గిపాలు అయ్యింది. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఘటనకు సంబంధించిన విధ్వంసాన్ని చూపించింది. కూలిపోయిన పైకప్పులు, కాలిపోయిన గోడలు కనిపించాయి. బాధితులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఆస్తి నష్టం 17.5 మిలియన్ ఫిలిప్పీన్ పెసోలుగా ఉండవచ్చని అంచనా.

ALSO READ: కాశ్మీర్ కలలు కంటున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు కౌంటర్!

 

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×