E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు ఫోన్ చేసిన అమర్  

Nindu Noorella Saavasam Serial Today February 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు ఫోన్ చేసిన అమర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మనోహరి కోపంగా రూంలో కూర్చుని టెడ్డిబేర్‌ను కత్తితో పొడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన చంభా మనోహరి ఏం చేస్తున్నావు.. ఆగు మనోహరి.. చెయ్యాల్సిన పని చేయకుండా ఈ పిచ్చి పనులేంటి మనోహరి అంటుంది. దీంతో మనోహరి మరింత కోపంగా టెడ్డిబేర్‌ను పక్కకు పడేసి గోడకేసి చేతులతో కొడుతూ.. భాగీని భయపెట్టి పారిపోయేలా పోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ అన్ని బెడిసికొడుతున్నాయి అంటుంది.

దీంతో చంభా బొమ్మను కత్తితో పొడిస్తే అది చస్తుంది. గోడల్ని పిడికిలితో కొడితే నీ పని జరుగుతుందా..? పిల్లల్ని చంపితేనో నిన్ను నువ్వు గాయపర్చుకుంటేనో..? అమరేంద్ర నీ సొంతం అవడు మనోహరి. ఈ పిచ్చి ప్రయత్నాలు పక్కన పెట్టి అమరేంద్రను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయ్‌. నువ్వు రణవీర్‌ భార్యవి అని తెలిస్తే నిన్ను చూడటం కాదు కదా..? అమరేంద్ర నిన్న చంపి కాటికి పంపిస్తాడు.  ఆ లోపే నువ్వు అమరేంద్ర చేతితో పసుపుతాడు కట్టించుకో మనోహరి. లేదంటే అదే చేతితో నీకు ఉరితాడు బిగిస్తాడు అంటూ మనోహరిని హెచ్చరించడంతో..

Advertisement

మనోహరి కోపంగా మొదటిసారి అమర్‌ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఆ అరుంధతి ఎగురేసుకుపోయింది. రెండో సారి అమర్‌ పక్కన పెళ్లిపీటల మీద కూర్చోవాలి అనుకున్నాను కానీ ఆ భాగీ కూర్చుంది. అని చెప్పగానే.. ముచ్చటగా మూడో సారి అయినా అమర్‌తో నీ పెళ్లి జరగాలి మనోహరి అని చంభా చెప్పగానే.. అందుకే కదా..? నేను ఇన్ని రోజులు ఎదురుచూస్తున్నాను అంటుంది. దీంతో నువ్వు ఎదురుచూసినంత మాత్రాన అమరేంద్ర తనకు తానుగా వచ్చి నీ మెడలో తాళి కట్టడు మనోహరి. నువ్వే ప్రయత్నం చేయాలి అని చెప్పగానే.. మనోహరి ఇరిటేటింగ్‌ గా ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇంకా నేను ఏం చేయాలి అంటుంది.

ఇప్పటి వరకు నీకు అమరేంద్రకు మధ్య అడ్డుగా ఉన్న వాళ్లను తప్పించడం కోసం నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు. ఇకనుంచి డైరెక్టుగా అమరేంద్రతో తాళి కట్టించుకునే ప్రయత్నం చేయ్‌.. పెద్ద పెద్ద మండపాల్లో మంగళవాయిద్యాలతో నీ పెళ్లి జరగాలని కోరుకోకు.. అది జరగని పని నీ పెళ్లి యాదృచ్చికంగా జరగాలి. అమరేంద్ర అనుకోకుండా నీ మెడలో తాళి కట్టాలి. కనురెప్ప మూసి తెరిచేలోపే నువ్వు అమరేంద్ర భార్య కావాలి. జరుగుతున్న దాడులన్నీ రణవీర్‌ భార్య చేస్తుందని అమరేంద్రకు అనుమానం వచ్చేలా నువ్వే చెప్పావు ఆ రణవీర్‌ భార్యవి నువ్వే అని తెలిస్తే అమర్‌ను పెళ్లి చేసుకోవాలన్న నీ కల ఎప్పటికీ నెరవేరదు ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు మనోహరి.. ఆలస్యం అమృతం విషం అంటూ చెప్పగానే.. మనోహరి కూడా కరెక్ట్‌ చెప్పావు చంభా నువ్వు చెప్పినట్టు అమర్‌ను అంగరంగవైభవంగా నేను పెళ్లి చేసుకోలేను.. అనుకోకుండా యాక్సిడెంటల్‌ గా మా పెళ్లి జరిగిపోవాలి. ప్లాన్‌ చేస్తాను. 48 గంటల్లోపు మాకు పెళ్లి జరిగేలా..? అమర్‌ నా మెడలో తాళి కట్టేలా ప్లాన్‌ చేస్తాను. మిగతా అన్ని ప్లాన్స్‌ పక్కన పెట్టి మా పెళ్లిపైన ఫోకస్‌ చేస్తాను. రెండు రోజుల్లో అమర్‌ తో మూడు ముళ్లు వేయించుకుంటాను.. ఈసారి మా పెళ్లి ఆ దేవుడు కూడా ఆపలేడు అంటుంది. దీంతో చంభా నీ ప్రయత్నం సఫలం కావాలి మనోహరి అంటుంది.

Advertisement

తర్వాత బుజ్జమ్మ, అంజు స్కూల్‌ లోంచి బయటకు వస్తారు. అప్పుడు బుజ్జమ్మ అక్కా ఈరోజు కూడా నేను మీ ఇంటికి వస్తాను అని చెప్తుంది. అవునా..? బుజ్జమ్మ అంటూ అంజు సంతోషపడుతుంటే.. అప్పుడే అమర్‌ వస్తాడు. అంజు వెళ్దామా..? అని అడగ్గానే.. అంజు డాడ్‌ ఇవాళ మనతో పాటు మన ఇంటికి బుజ్జమ్మ కూడా వస్తుందట అని చెప్తుంది. దీంతో అమర్‌ హ్యాపీగా అవునా బుజ్జమ్మా… సరే వెళ్దాం అయితే కానీ ఈ విషయం మీ మేడంకు చెప్పావా..? అని అడగ్గానే.. లేదు ఫోన్‌ చేసి చెప్తాను అంటుంది బుజ్జమ్మ. వెంటనే అమర్‌ తన ఫోన్‌ బుజ్జమ్మకు ఇస్తాడు. బుజ్జమ్మ, మిస్సమ్మ ఫోన్‌కు డయల్ చేసి అమర్‌కు ఇస్తుంది. అమర్‌ ఫోన్ చేయడంతో మిస్సమ్మ కంగారు పడుతుంది. కరుణకు అమర్‌ ఫోన్‌ చేస్తున్నాడని చెప్తుంది. అయితే లిప్ట్‌ చేసి లౌడ్‌ స్పీకర్‌ పెట్టి మాట్లాడు అంటుంది కరుణ. మిస్సమ్మ ఒక క్లాత్‌ అడ్డంగా పెట్టుకుని హలో అంటుంది. ఆ వాయిస్‌ విన్న అమర్‌ వెంటనే మిస్సమ్మను గుర్తు చేసుకుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×