E-Paper
Advertisement

Romantic Movie OTT : ఒకే గదిలో ప్రేమ జంట… ఆ పనులన్నీ కల్లోనే… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

Romantic Movie OTT : ఒకే గదిలో ప్రేమ జంట… ఆ పనులన్నీ కల్లోనే… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
Advertisement

Romantic Movie OTT : రియల్ లవ్ స్టోరీలా ఫీల్ అయ్యే సినిమాని చూడాలనుకుంటే ఈ చైనీస్ ప్రేమకథను చూడాల్సిందే. యంగ్ జనరేషన్ స్ట్రగుల్స్ ను చాలా రియలిస్టిక్‌గా చూపిస్తుంది. రొమాంటిక్ డ్రామా, ఎమోషనల్ మూవీలు ఇష్టపడితే ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా కథ చాలా ఎమోషనల్‌గా, మన పక్కింటి వాళ్ల కథలాగే అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా ఒక విభిన్న శైలిలో ఉంటుంది. గతంలోని ప్రేమకథను స్క్రీన్ మీద కలర్ లో, విడిపోయాక బ్లాక్ అండ్ వైట్ లో చూపించడం విశేషం. ఇది చైనీస్ కొత్త సంవత్సరం సందర్భంగా రైలు ప్రయాణంలో పరిచయమైన ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘అజ్ అండ్ దెమ్’ (Us and Them). ప్రముఖ నటి రెనే లీ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఇందులో జింగ్ బోరాన్, జౌ డోంగ్యు ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ చిత్రం చైనాలో భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇది బాక్స్ ఆఫీస్‌లో $209 మిలియన్ లను కలెక్ట్ చేసింది. 2018 లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఇది అందుబాటులో ఉంది. IMDbలో దాదాపు ఎనివిదికి పైగా రేటింగ్ ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చైనాలో కొత్త సంవత్సరం వేడుక సందర్భంలో, ఊరికి వెళ్లే ఒక రద్దీగా ఉండే రైలులో జియాన్‌కింగ్, జియాక్సియో మొదటిసారి కలుస్తారు. ఇద్దరికీ బీజింగ్ లాంటి పెద్ద నగరంలో ఏదో ఒకటి సాధించి, బాగా డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, సిటీలో ఒక చిన్న రేకుల గదిలో ఉంటూ కష్టసుఖాలను పంచుకుంటారు. అయితే జీవితంలో ఎదురయ్యే వరుస ఓటముల వల్ల వాళ్ళ మధ్య గొడవలు మొదలై, మనస్పర్థలతో ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోతారు.

కట్ చేస్తే.. పదేళ్ల తర్వాత మళ్లీ ఒక విమాన ప్రయాణంలో అనుకోకుండా కలుస్తారు. ఇప్పుడు జియాన్‌కింగ్ పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సెటిల్ అయి ఉంటాడు. కానీ వారిద్దరి మధ్య పాత ప్రేమ అలాగే ఉంటుంది. విమానం ఆలస్యం అవ్వడంతో ఒక హోటల్‌లో గడుపుతూ, మనం అప్పుడు విడిపోకపోయి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేవాళ్లం? అని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ప్రస్తుతం వారి జీవితాల్లో అన్నీ ఉన్నా, ఒకరినొకరు కోల్పోయామన్న వెలితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి వీళ్ళ ప్రేమ మళ్ళీ కలుపుతుందా ? ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ విడిపోతారా ? ఈ సినిమాలోని ముగింపు ఎలా ఉంటుంది ? ఆనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఓటీటీలో ఆకట్టుకుంటున్న ‘స్పేస్ జెన్ చంద్రయాన్’… స్పేస్ అడ్వెంచర్ లవర్స్ కు ఐ ఫీస్ట్ ఈ సిరీస్

Tags

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×