E-Paper
Advertisement

శ్రేయ‌స్ అయ్య‌ర్ దెబ్బ‌కు ప‌క్షి విల విల‌…జాకబ్‌ బెతెల్ చేసిన ప‌నికి ఫిదా కావాల్సిందే

శ్రేయ‌స్ అయ్య‌ర్ దెబ్బ‌కు ప‌క్షి విల విల‌…జాకబ్‌ బెతెల్ చేసిన ప‌నికి ఫిదా కావాల్సిందే
Advertisement

Shreyas Iyer shot hits a seagull :  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య నిన్న రెండవ వ‌న్డే జరిగిన సంగతి తెలిసిందే. కార్డీప్ లోని సోఫియా గార్డెన్స్ (Sophia Gardens, Cardiff) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండు నాలుగు వికెట్ల తేడాతో.. మళ్లీ గెలుపు బాట పట్టింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer shot hits a seagull), చేసిన పనికి ఓ పక్షి బలైంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో… శ్రేయస్ అయ్యర్ భారీ షాట్ ఆడాడు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి మైదానంలో వాలిన ఓ పక్షికి తగిలింది. దీంతో పక్షి తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో వెంటనే అలర్ట్ అయిన జాకబ్‌ బెతెల్ ( Jacob Bethell), ఆ పక్షిని తీసుకువెళ్లి ఫిజియోథెరపిస్ట్ కు అప్పగించి ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

శ్రేయ‌స్ దెబ్బ‌కు ప‌క్షి విల విల‌…బెతెల్ చేసిన ప‌నికి ఫిదా కావాల్సిందే

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో గిల్ సేన మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టాప్ బార్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ విఫలమైన నేపథ్యంలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ 43 పరుగుల వద్ద ఉండగా.. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ మహమూద్ బరిలోకి దిగాడు. అయితే మహమూద్ వేసిన ఓ బంతిని ఆఫ్ సైడ్ వైపు బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు శ్రేయస్ అయ్యర్. అయితే అదే సమయంలో మైదానంలో వాలిన ఓ పక్షికి శ్రేయస్ అయ్యర్ కొట్టిన బంతి బలంగా తాకింది. దీంతో ఆ పక్షి అక్కడే విలవిలలాడిపోయింది. అయితే పక్షి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. ఇంగ్లాండ్ డేంజర్ ఆటగాడు జాకబ్‌ బెతెల్ వెంటనే తన చేతులతో పక్షిని పట్టుకొని.. ఫిజియోథెరపిస్టుకు అప్పగించాడు. ఈ నేపథ్యంలోనే లేడీ ఫిజియోథెరపిస్టు.. ఆ పక్షికి ప్రాణాలు పోసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు జాకబ్‌ బెతెల్ ను మెచ్చుకుంటున్నారు.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్

Advertisement

రెండవ వన్డేలో టీమిండియాను చిత్తుగా ఓడించింది ఇంగ్లాండు. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 233 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. ఈ లక్ష్యాన్ని కేవలం 44.1 ఓవర్లలో బ్రూక్ సేన అవలీలగా ఛేదించింది. దీంతో సిరీస్ స‌మం అయింది. మూడో వ‌న్డేలో గెలిచిన‌వాళ్లకే సిరీస్ ద‌క్కుతుంది.

 

?igsh=MWlzeG8xZGZieWc1OQ==

Related News

వెన్నుపోటు పొడిచిన అట్కిన్సన్…రూట్ సెంచ‌రీ మిస్ చేసుకోవ‌డంపై రాజుకున్న వివాదం

2027 వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ ఔట్..19న లార్డ్స్ లో రిటైర్మెంట్?

గంభీర్ కు ఒళ్లంతా అహంకారం, అందుకే టీమిండియా ఓడిపోతోంది

బీసీసీఐ వేసే బిస్కెట్ల‌కు ఐసీసీ అమ్ముడుపోయిది..అందుకే టీమిండియాకు వ‌రుస‌గా ట్రోఫీలు

Video: సామ్ కర్రన్ కుప్పిగంతులు..ఇచ్చిప‌డేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్

Video: లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్

RCBలో టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌**త్య చేసుకోవాలని అనుకున్నా

Big Stories

Advertisement
×