E-Paper
Advertisement

శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తల్లికి వందనం నిధులు విడుదల, ఖాతా చెక్ చేసుకోండి

శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తల్లికి వందనం నిధులు విడుదల, ఖాతా చెక్ చేసుకోండి
Advertisement

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది. తల్లికి వందనం కోసం నిధులను విడుదల చేసింది. వచ్చే బుధవారం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. ఇందుకోసం రూ.10,120 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం విద్యాశాఖ అనుమతి ఇచ్చింది.

శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం-ఎట్టకేలకు విద్యార్థులు, తల్లిదండ్రులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక చేపట్టిన తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22న అనగా బుధవారం నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకం కోసం అక్షరాలా రూ.10,120.78 కోట్లు చెల్లించేందుకు విద్యాశాఖకు అనుమతి ఇచ్చింది.

Advertisement

తల్లికి వందనం నిధులు విడుదల-ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి చిన్నారికి ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున సాయం చేస్తోంది. వేసవి సెలవులు తర్వాత పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత  తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13వేలు జమ చేస్తోంది. మరో రెండువేలు పాఠశాల నిర్వహణకు ఖర్చు చేస్తోంది.

జూలై 22న తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ-ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని  67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 42.70లక్షల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అర్హులైన తల్లులు లేకుంటే సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో వచ్చే బుధవారం డీబీటీ ద్వారా డబ్బులు జమ చేయనుంది.

Advertisement

ఈ ఏడాది అడ్మిషన్లు తీసుకున్న వారికి ఆగస్టు 30 లోపు-ఈ విద్య సంవత్సరంలో  పాఠశాల-కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలను వెరిఫై చేసింది ప్రభుత్వం. అర్హులైన వారి జాబితాను ఈనెల 22న స్వర్ణ గ్రామ-వార్డు కార్యాలయాల్లో ప్రకటిస్తారు. ఆ రోజు తల్లుల వారి ఖాతాల్లో నగదు జమ కానుంది.

అయితే కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న ఒకటి నుంచి తొమ్మిదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధుల అర్హతను బట్టి  వారికి ఆగస్టు 30 నాటికి వారి తల్లుల ఖాతాల్లో నగడు జమ చేయనుంది. నిధులు పడలేనివారి నుంచి అదే రోజు నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

ALSO READ: దేశంలో కొవిడ్ కేసులు కలకలం.. ఏపీలో నలుగురు మృతి,  రాయలసీమలో ఎక్కువ కేసులు

ఆగస్ట్ 4 నుంచి 10 వరకు వాటిని పరిశీలించి అదనపు అర్హుల జాబితా రెడీ చేస్తారు. వారి అర్హతలను పరిశీలించిన తర్వాత  ఆగస్టు 30న వారి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నట్లు ప్రకటన చేసింది. ఆర్టీఈ చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×