Amazon Services: క్లౌడ్ సేవలలో ప్రపంచ అగ్రగామి అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సాంకేతిక లోపాన్ని ఎదుర్కోవడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ఆన్‌లైన్ సేవలు, ప్లాట్‌ఫారమ్‌లు నిలిచిపోయాయి. ఈ అంతరాయం కారణంగా స్నాప్‌చాట్, ఫోర్ట్‌నైట్ వంటి ప్రముఖ యాప్‌లతో పాటు, టాప్ వెబ్‌సైట్‌ల సేవలు కూడా ప్రభావితమయ్యాయి.
అంతర్జాతీయ స్థాయిలో సేవలకు అంతరాయం
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైనట్లుగా భావిస్తున్న ఈ అవుటేజ్ గురించి డౌన్ డిటెక్టర్ (Downdetector) వెబ్‌సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 15,000 మందికి పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. AWS తన అధికారిక పేజీలో “US-EAST-1 ప్రాంతంలో అనేక సేవలకు అంతరాయం కలిగింది. లేటెన్సీ కనిపిస్తోంది” అని పేర్కొంది. ఈ సమస్య ప్రధానంగా అమెజాన్ క్లౌడ్ వ్యవస్థపై ఆధారపడే యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లకు కనెక్టివిటీ సమస్యలను సృష్టించింది.
ప్రభావితమైన ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లు
AWS అవుటేజ్ ప్రభావం అనేక కీలక ఆన్‌లైన్ సేవలు, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఫైనాన్షియల్ సిస్టమ్‌లపై పడింది. డౌన్ డిటెక్టర్ డేటా ప్రకారం, Perplexity AI, Amazon Alexa, Prime Video, Epic Games Store, Venmo, Chime, Reddit, Signal, Coinbase, Canva, McDonald’s App, Disney+, Playstation Network వంటి ఎన్నో సేవలు నిలిచిపోయాయి.
స్నాప్‌చాట్, ఫోర్ట్‌నైట్, అలెక్సా, ప్రైమ్ వీడియో, డ్యూలింగో, రింగ్ వంటి అమెజాన్ క్లౌడ్ ఆధారిత సేవలు కూడా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ పర్‌ప్లెక్సిటీ (Perplexity AI) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ X ద్వారా తమ సేవలు నిలిచిపోయాయని, దానికి కారణం AWS సమస్యేనని తెలిపారు. అలాగే, కాయిన్ బేస్ (Coinbase), రాబిన్ హుడ్ (Robinhood) వంటి ప్రముఖ క్రిప్టోకరెన్సీ, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఈ లోపం కారణంగా సేవలకు అంతరాయం ఎదుర్కొన్నాయి.
రైడ్-షేరింగ్ యాప్ లిఫ్ట్ (Lyft) సేవలు కూడా అమెరికాలో వేలాది మంది వినియోగదారులకు పనిచేయలేదు, మెసేజింగ్ యాప్ సిగ్నల్ (Signal) సైతం తమ సేవపై అవుటేజ్ ప్రభావం పడిందని అంగీకరించింది.
స్పందించిన అమెజాన్
అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ అధికారిక పేజీలో ఈ సాంకేతిక లోపం “US-EAST-1 ప్రాంతంలో ఉన్న అనేక సేవలకు అంతరాయం కలిగించింది” అని స్పష్టం చేసింది. ఈ అంతరాయానికి గల కారణాన్ని “DynamoDB API ఎండ్‌పాయింట్ DNS రిజల్యూషన్ సమస్య”గా గుర్తించినట్లు తెలిపింది. లోపాన్ని పరిష్కరించే దిశగా ఇంజనీరింగ్ బృందం వేగంగా పనిచేస్తోందని పేర్కొంది.
“కొన్ని సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే, ఇంకా పలు ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు మళ్లీ ఒకసారి రీట్రై చేయండి” అని అమెజాన్ సూచించింది.
ప్రభావితమైన కీలక AWS సేవలు
AWS అధికారిక పేజీలో మొత్తం 37 సేవలు ఈ లోపం వల్ల ప్రభావితమైనట్లు తెలిపింది. వాటిలో ప్రధానంగా:
వీటితో పాటు AWS Batch, Database Migration Service, Global Accelerator, Elemental, Polly, Q Business వంటి సేవలు కూడా అవుటేజ్‌కు గురయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులు ఉపయోగించే యాప్‌లు, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఫైనాన్షియల్ సిస్టమ్‌లకు AWS సర్వర్లు ప్రాణాధారంగా ఉన్నాయి. ఈ అవుటేజ్ వల్ల ఇంటర్నెట్‌లో పెద్ద భాగం తాత్కాలికంగా నిలిచిపోయింది.
ALSO READ: Diwali 2025 Zodiac: 100 ఏళ్ల తర్వాత దీపావళి నాడు హంస మహాపురుష రాజయోగం.. వీరిపై కాసుల వర్షం
AWS అవుటేజ్ పునరుద్ధరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే పలు సమస్యలను తొలగించామని, పెండింగ్‌లో ఉన్న రిక్వెస్ట్‌లను పరిష్కరించేందుకు బృందం చురుకుగా పనిచేస్తోందని అమెజాన్ తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలను త్వరలో అందిస్తామని వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సేవల్లో ఇంత పెద్ద అంతరాయం కలగడం ఆందోళన కలిగించే విషయం.
ALSO READ: Babar Azam: ప్రమాదంలో బాబర్ కెరీర్.. 781 నుంచి ఒక్క సెంచరీ లేదు..ఇక రిటైర్మెంట్ ఖాయం