OTT Movie : ఫాంటసీ కంటెంట్ లను రూపొందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దర్శకులు. నిర్మాణ సంస్థలు కూడా ఇలాంటి జానర్లకే ఓటు వేస్తున్నాయి. టెక్నాలజీ ఊపందుకుంటున్న ఈ రోజుల్లో విజువల్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇవి సినిమాలకు, వెబ్ సిరీస్ లకి హైప్ తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజువల్స్ తో ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ ‘యక్షిణి’. నటి వేదిక ప్రధాన పాత్రలో నటించిన ఈ కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది ఓటీటీలో ట్రెండింగ్ లో కూడా నడిచింది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? ఈ కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘యక్షిణి’ (Yakshini) 2024లో వచ్చిన తెలుగు ఫ్యాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. తేజా మార్ని దర్శకత్వంలో వేదిక, రాహుల్ విజయ్, లక్ష్మి మంచు, అజయ్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 6 ఎపిసోడ్‌లతో 2024 జూన్ 14న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల అయింది. IMDbలో 7.2/10 రేటింగ్ కూడా పొందింది.
మాయా అనే యువతి యక్ష లోకంలో ఉంటుంది. కానీ ఒక తప్పు చేసినందుకు దేవుడు ఆమెను శపిస్తాడు. ఆ శాపం నుంచి బయటపడాలంటే, ఆమె భూమిపై 100 మంది మగవాళ్లను చంపాల్సిఉంటుంది. మాయా మనుషుల రూపంలో భూమిపైకి వస్తుంది. ఆమె అందంతో మగాళ్లను ఆకర్షిస్తూ, శాపం నుంచి బయట పడటానికి చంపడం మొదలెడుతుంది. ఈ సమయంలో కృష్ణ అనే అబ్బాయిని కలుస్తుంది. కృష్ణ మాయాను మనస్పూర్తిగా ప్రేమిస్తాడు. ఆమెకు కూడా అతను నచ్చుతాడు. మాయా మొదట కృష్ణను తన ప్లాన్‌లో భాగం చేయాలనుకుంటుంది. కానీ అతని ప్రేమ వల్ల ఆమె మనసు మారుతుంది. కృష్ణతో సమయం గడిపే కొద్దీ ఆమెకు ప్రేమ ఎక్కువవుతుంది.
Read Also : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు
అయితే ఒక రోజు కృష్ణకు మాయా ఒక యక్షిణి అనే నిజం తెలిసిపోతుంది. అతను ఆమెను మనుషుల్ని చంపడం ఆపమని, మంచిగా మారమని చెబుతాడు. అయితే యక్ష లోకం నుంచి కొన్ని చెడు శక్తులు, ఆమె శాపం పూర్తి చేయమని బెదిరిస్తాయి. మాయా తన శాపం, కృష్ణ ప్రేమ మధ్య చిక్కుకుంటుంది. ఇప్పుడు కథ భయంకరమైన ఫ్యాంటసీ సీన్స్, రొమాంటిక్ మూమెంట్స్, థ్రిల్లర్ ట్విస్ట్‌లతో నడుస్తుంది. చివరికి మాయా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. దీంతో స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి ? 100 మంది మగాళ్లను చంపి, శాపం నుంచి బయట పడుతుందా ? తన లోకానికి పోకుండా కృష్ణ ప్రేమకి లొంగిపోతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.