Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) కెరీర్ ప్రమాదంలో పడింది. సరైన ఫామ్ లేకపోవడం కారణంగా గతంలో కెప్టెన్సీ కోల్పోయిన బాబర్ ఆజం తీరులో ఇప్పటికి కూడా మార్పు రాలేదు. జట్టు నుంచి తొలగించినా కూడా బుద్ధి తెచ్చుకోవడం లేదు బాబర్. చివరికి సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ క్రికెట్ లో కూడా పెద్దగా రాణించడం లేదు. మొదటి టెస్ట్ లో విఫలమైన బాబర్ ఆజం ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే తరహాలో విఫలమయ్యాడు. వైట్ బాల్ క్రికెట్ లో దాదాపు 781 రోజులు పూర్తయినా కూడా సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. 75 ఇన్నింగ్స్ లు అవకాశాలు వచ్చిన ఒక్క సెంచరీ చేయకుండా దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు బాబర్ ఆజం. అటు 1030 నుంచి టెస్టుల్లో కూడా సెంచరీ చేయలేదు. దీంతో బాబర్ ఆజం రిటైర్మెంట్ తీసుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన బాబర్ ఆజం పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారయింది. అసలు అతనికి జట్టులో చోటు రావడమే కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో అతను పెద్దగా రాణించకపోవడం చూస్తున్నాం. 2023 ఆసియా కప్ టోర్నమెంట్ సమయంలో సెంచరీ చేశాడు బాబర్ ఆజం. అది కూడా వన్డే ఫార్మాట్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైట్ బాల్ క్రికెటర్ లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అలా 781 రోజులు అయినప్పటికీ సెంచరీ మాత్రం నమోదు చేయలేదు. ఇటు టెస్ట్ క్రికెట్ లో కూడా అదే పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
1030 రోజులు పూర్తయినప్పటికీ టెస్టుల్లో కూడా సెంచరీ చేయలేదు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam). ఇక గత 15 టెస్ట్ ఇన్నింగ్స్ లో బాబర్ ఆజం చేసిన పరుగులు 200 కూడా దాటలేదు. 24, 27, 0, 22, 31, 11, 30, 5, 8, 5, 1, 31, 23, 42, 16 పరుగులు మాత్రమే తన చివరి ఇన్నింగ్స్ లలో చేశాడు. దీంతో 18.40 యావరేజ్ తో దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం తమ సొంత దేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు బాబర్ ఆజం. దీంతో అతన్ని జట్టు నుంచి తొలగిస్తారని అంటున్నారు. కాగా పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతోంది. ఇందులో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ లో కూడా బాబర్ 16 పరుగులకే ఔట్ అయ్యాడు. అటు పాక్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు నష్టపోయి 259 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మొదటి రోజు ఇవాల్టికి పూర్తయింది. ప్రస్తుతం పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షకీల్ 42 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. మరోవైపు సల్మాన్ అఘ పది పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
🚨 BABAR AZAM IS FINISHED 🚨
774 days for White ball 💯
1,030 days for Test 💯Babar Azam's Last 💯 came against Nepal🇳🇵in Asia Cup 2023 at Multan Highway😨 But, still some Pakistani's will compare him with King Kohli😅
– What's your take🤔 #PAKvSA pic.twitter.com/7MhX7sjOun
— Richard Kettleborough (@RichKettle07) October 20, 2025
It's 75 Innings & 781 Days for Babar Azam hasn't scored an International Hundred. 😱
– Babar Azam scored his last Int'l Hundred Vs Nepal on 30th Aug 2023. pic.twitter.com/HE1F2mLHIK
— Tanuj (@ImTanujSingh) October 20, 2025