E-Paper
Advertisement

America : అమెరికా ఫైటర్ జెట్.. డేంజర్ ల్యాండింగ్..

America : అమెరికా ఫైటర్ జెట్.. డేంజర్ ల్యాండింగ్..
Advertisement

America : అమెరికా వాయుసేనకు చెందిన ఎఫ్‌ 35బీ ఫైటర్‌ జెట్‌ విమానం ల్యాండ్‌ అవుతున్న క్రమంలో కుప్పకూలిపోయింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టెక్సాస్‌లోని ఎయిర్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌ మాదిరిగా ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌ యత్నించాడు. అయితే, చక్రాలు నేలను తాకిన అనంతరం జెట్‌ ఒక్కసారిగా అదుపు తప్పింది. ముందుభాగం నేలను ఢీ కొట్టింది.

విమానాన్ని నియంత్రించేందుకు పైలట్‌ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పైలట్‌ పారాచూట్‌ సాయంతో బయటకు వచ్చేశాడు. ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు రికార్డు చేసి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకొని జెట్‌ పేలకుండా చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు అమెరికా వాయుసేన ఉన్నతాధికారులు వెల్లడించారు.

Tags

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×