BigTV English
Advertisement

Tcong: రేవంత్ ను మార్చేస్తారా? కాంగ్రెస్ చీలిపోతుందా?.. వాట్ నెక్ట్స్?

Tcong: రేవంత్ ను మార్చేస్తారా? కాంగ్రెస్ చీలిపోతుందా?.. వాట్ నెక్ట్స్?

Tcong: కాంగ్రెస్ ను ఎవరూ ఓడించనవసరం లేదు. వాళ్లను వాళ్లే ఓడించుకుంటారు. ఇది రాజకీయాల్లో వినిపించే మోస్ట్ పాపులర్ కోట్. ఈ మాట నిజమేనని గతంలో పలుమార్లు నిరూపితమైంది. ఈసారి మళ్లీ అదే జరుగుతోందా? కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ల ఎపిసోడ్ ఎక్కడికి దారి తీస్తుంది? వలస నేతలపై పాత కాపుల తిరుగుబాటు.. ఏ తీరాలకు? ఇవే ఆసక్తికర ప్రశ్నలు.


సీనియర్లంతా మంతనాలు జరిపారు. రేవంత్ రెడ్డిపై, కొత్తకమిటీ కూర్పుపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినదంతా చెప్పేశారు. వారి నెక్ట్స్ స్టెప్.. హైకమాండ్ కు ఫిర్యాదు చేయడమే. కమిటీ వేసిందే అధిష్టానం.. మరి, హైకమాండ్ సీనియర్ల మొర ఆలకిస్తుందా?

కొత్త కమిటీలు ప్రకటించి వారం కావొస్తుంది. అది కాస్త కాస్త రగిలి.. ఇప్పటికి అగ్గి రాజుకుంది. మొదట కొండా సురేఖతో మొదలైంది. ఆ తర్వాత బెల్లయ్య నాయక్, దామోదరల వంతు. ఇప్పుడు ఉత్తమ్, జగ్గారెడ్డితో సహా.. భట్టి నాయకత్వంలో అంతా ఏకమయ్యారు. కోమటిరెడ్డి సైతం వారితో సై అనేశారు. సేవ్ కాంగ్రెస్ స్లోగన్ తో రేవంత్ రెడ్డి అండ్ కో కు రెబెల్స్ గా మారారు. మరి, పార్టీలో వారి ఫైట్ ఎందాక కొనసాగనుంది? సీనియర్లంతా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే.. కమిటీ కూర్పును మళ్లీ మార్చేసే ఛాన్స్ ఉంటుందా? అలా కుదరదు.. అంతా రేవంత్ రెడ్డి నేతృత్వంలో పని చేయాల్సిందేనని హైకమాండ్ తేల్చి చెబుతుందా? అలా చెబితే.. సీనియర్ల ముందున్న ఆప్షన్ ఏంటి?


సంఖ్యాపరంగా చూస్తే సీనియర్లు చాలా మందే ఉన్నారు. అంతా హేమాహేమీలే. వారంతా కలిసికట్టుగా వచ్చి అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తే..! అధిష్టానం పునరాలోచన చేస్తుందా? కమిటీని మారుస్తుందా? లేదంటే, ఏకంగా రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ పోస్ట్ నుంచి మార్చేస్తుందా? ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని మార్చేయడం జరిగే పనేనా? అలాగని, రేవంత్ కోసం ఇంతమంది సీనియర్ల మొరను ఆలకించకుండా ఉండగలదా? అసలేం జరగనుంది?

సీనియర్లను కూల్ చేసేందుకు.. మారిస్తే ఒకరిద్దరిని మార్చే ఛాన్స్ ఉండొచ్చు. రేవంత్ కీ టీమ్ జోలికి మాత్రం వెళ్లకపోవచ్చు. సీనియర్లు కాబట్టి.. ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన వారు కాబట్టి.. వారిని అంత ఈజీగా పక్కన పెట్టేయకపోవచ్చు. అలాగని రేవంత్ రెడ్డిని సైతం డిసప్పాయింట్ చేయకపోవచ్చు. హైకమాండ్ కు పెద్ద చిక్కే వచ్చిపడిందని అంటున్నారు. సీనియర్లంతా నిఖార్సైన కాంగ్రెస్ వాదులే. పార్టీని చీల్చడం కానీ, పార్టీని వీడటం కానీ చేయకపోవచ్చు. అలాగని రేవంత్ కూ సహకరించకపోవచ్చు. ఎప్పటిలానే ఇకముందు కూడా కలహాల కాపురం కొనసాగవచ్చు. ప్రస్తుత కల్లోలం.. టీ కప్పులో తుపానులా కొంతకాలానికి సద్దుమనగవచ్చు. ఇలాంటివన్నీ కాంగ్రెస్ లో కామనేగా..అంటున్నారు విశ్లేషకులు.

Related News

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Big Stories

×