E-Paper
Advertisement

ఏఐతో బాంబు తయారీ.. ఆ తర్వాత భారీ భవనం పేలుడుకి కుట్ర, అధికారుల అదుపులో టీనేజర్

ఏఐతో బాంబు తయారీ.. ఆ తర్వాత భారీ భవనం పేలుడుకి కుట్ర, అధికారుల అదుపులో టీనేజర్
Advertisement

Pakistan: అరచేతిలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మంచి కంటే చెడు ఎక్కువగా కనిపిస్తోంది. కొత్తగా ప్రయత్నాలు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు యువతీ యువకులు. ఏఐ సాయంతో పేలుడు పదార్థాలు తయారు చేసి ఓ విద్యాసంస్థపై దాడికి ప్లాన్ చేశాడన్న ఆరోపణలతో 17 ఏళ్ల టీనేజర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో బయటపడింది.

ఎఫ్‌బీఐ సమాచారంతో పాక్‌లో టీనేజర్ అరెస్ట్

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కాలేజీ చదువుతున్నాడు ఓ విద్యార్థి. టెక్నాలజీ చేతిలోకి అందుబాటులోకి రావడంతో కొత్త ఓ స్కెచ్ వేశాడు. క్లాడ్ ఏఐతో పేలుడు పదార్థాల తయారీ గురించి తొలుత ఆరా తీశాడు. ఆ తర్వాత పెద్ద భవనాన్ని పేల్చేందుకు ఎలాంటి రసాయనాలు ఉపయోగించాలని వివరాలు అడిగాడు. పొటాషియం అమ్మోనియం నైట్రేట్, చక్కెరతో సహా పలు రసాయనాలను కలపడంపై కోరినట్లు సమాచారం.

Advertisement

అదే సమయంలో ఏఐ చాట్‌బాల్ పలు ప్రశ్నలు రైజ్ చేసింది. దీంతో ఆ టీనేజర్.. ప్రభుత్వ విద్యాసంస్థను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలనే తన ఉద్దేశాన్ని కాఫీ తాగుతూ చెప్పాడు. యువకుడి ఛాటింగ్ విషయాలను గుర్తించిన ఆంత్రోపిక్ సంస్థ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎఫ్‌బీఐకి సమాచారం ఇచ్చింది. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులు.. పాకిస్థాన్‌లోని నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చారు.

ఏఐతో బాంబు తయారీ, విద్యాసంస్థ పేలుడుకు కుట్ర!

రంగంలోకి దిగిన లాహోర్ పోలీసు అధికారులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఏఐతో చాట్ చేయడానికి ఉపయోగించిన ల్యాప్‌టాప్‌ సీజ్ చేశారు. చాటింగ్‌లో ప్రమాదకర సంభాషణలకు సంబంధించిన డేటా ఉన్నట్లు సమాచారం. యువకుడి ఇంట్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు లభించలేదని తెలిపారు. పాకిస్థాన్ సైబర్ క్రైమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దాన్ని అన్ని కోణాల్లో  దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

విద్యార్థి మానసిక పరిస్థితిని అంచనా వేస్తున్నారు. యువకుడి మొబైల్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు సంసానేజ కుట్ర వెనుక అసలు కారణమేంటి? వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్‌బీఐ అధికారులు సమాచారం ఇచ్చారంటే, ఈ వ్యవహారం గట్టిగానే ఉంటుందని అంటున్నారు.

ALSO READ: ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మంటలు ఎగిసిపడడంతో 31 మంది సజీవ దహనం, ఈజిప్టులో దారుణం

Related News

ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మంటలు ఎగిసిపడడంతో 31 మంది సజీవ దహనం, ఈజిప్టులో దారుణం

రెండేళ్ల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా రీఎంట్రీ.. ఆ రోజు బంగ్లాలో అడుగు, సంకెళ్లతో రావాలన్న ప్రభుత్వం

బంగ్లాదేశ్‌లో మళ్లీ భగ్గుమన్న హింసలు.. 30 ఇళ్లకు పైగా అగ్గిపాలు

డోనాల్డ్ ట్రంప్‌‌కు ఘోర అవమానం.. పట్టించుకోని నార్త్ కొరియా..?

తరాలు మారినా వీరి ఇల్లు మాత్రం మారదు.. చైనాలో ఓ అద్బుత రాజ్యం?

టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్.. విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీగా పన్నులు, విశాఖ డేటా సెంటర్ మాటేంటి?

సౌదీలో రూటు మార్చిన హూతీలు.. రియాద్‌లో భారీ భవనాలు టార్గెట్, పీఐఎఫ్ టవర్‌పై క్షిపణుల దాడి

Big Stories

Advertisement
×