BigTV English

Pakistan : లాహోర్ వదిలి పారిపోండి.. అమెరికా హెచ్చరిక

Pakistan : లాహోర్ వదిలి పారిపోండి.. అమెరికా హెచ్చరిక

Pakistan : పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తోంది ఇండియా. మొన్న అర్థరాత్రి చిమ్మచీకట్లో మిస్సైళ్లతో మెరుపు దాడులు చేస్తే.. లేటెస్ట్‌గా సూర్యోదయం సమయంలో డ్రోన్లతో విరుచుకుపడింది. తెల్లారేసరికల్లా లాహోర్ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం బూడిద కుప్పగా మారింది. లాహోర్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. భారత్ దెబ్బకు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం అయింది. మన డ్రోన్ల ముందు.. ఆ చైనా మేడ్ HQ-9 వ్యవస్థ నిలవలేక పోయింది. లాహోర్ డిఫెన్స్ సర్వనాశనం. భారత్ దెబ్బ ఎట్టా ఉంటాదో ఇప్పుడు పాకిస్తాన్‌కు బాగా తెలిసొచ్చింది.


లాహోర్ ఎంతలా డ్యామేజ్ అయిందంటే.. వెంటనే అమెరికా నుంచి రియాక్షన్ వచ్చేంతలా. వెంటనే పాకిస్తాన్‌ను వీడి వెళ్లాలంటూ తమ పౌరులకు సూచించింది అమెరికా. లాహోర్‌కు మాత్రం అస్సలు వెళ్లకండి అని హెచ్చరించింది. ఇప్పటికే లాహోర్‌లో ఎవరైనా ఉంటే.. వాళ్లు వెంటనే నగరం విడిచి వెల్లాలని.. లేదంటే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశించింది అగ్రరాజ్యం. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని.. ఇంటికే పరిమితం కావలని తెలిపింది. ఆ మేరకు పాక్‌లోని US కాన్సులేట్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×