Eating Eggs In Summer: సీజన్‌కు అనుగుణంగా మనం తినే ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకుంటూ ఉంటాం.
శరీరానికి ఒక్కో సీజన్‌లో ఒక్కో రకమైన పోషకాలు అవసరం అవుతాయి. వేసవి కాలంలో మనం శరీరానికి వేడి కలిగించే పదార్థాలను తక్కువగా తింటూము. చలికాలంలో చల్లని పదార్థాల తినడాన్ని తగ్గిస్తాము. ఇదిలా ఉంటే ముఖ్యంగా వేసవి కాలంలో గుడ్లు తినాలా ? వద్దా ? అనే అయోమయంలో చాలా మందే ఉంటారు. ఇందుకు సంబంధించిన సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో గుడ్లు ఎక్కువగా తినకూడదనే మాట తరచుగా మీరు వినే ఉంటారు. వేసవి కాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో అజీర్ణం, వాంతులు, వేడి సమస్య పెరుగుతుంది. డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. వేసవిలో గుడ్లు సరైన పరిమాణంలో తీసుకుంటే.. ఎలాంటి సమస్య ఉండదు. కానీ రోజుకు రెండు లేదా మూడు గుడ్లు తినడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు దీనిని ఉడకబెట్టడం ద్వారా లేదా ఆమ్లెట్ లాగా తయారు చేసుకుని కూడా తినవచ్చు. అందుకే ప్రతిరోజూ గుడ్లు తినమని అంటారు.
గుడ్డులోని పోషకాలు:
ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం గుడ్లలో ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో మీరు గుడ్డులోని పసుపు భాగాన్ని తీసి తింటే అది మరింత మెరుగైనా ప్రయోజనాలను అందిస్తుంది. ఎందుకంటే ఈ పసుపు భాగం వేడి స్వభావాన్ని కలిగిస్తుంది.
గుడ్లలో లభించే పొటాషియం, సోడియం, భాస్వరం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరానికి మేలు చేస్తాయి. వేసవిలో చెమట పట్టడం వల్ల నీటిని కోల్పోతుంటాం. అందుకే సరైన పరిమాణంలో గుడ్లు తినడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. వేసవిలో ఎక్కువగా అలసిపోయినట్లు కూడా అనిపిస్తుంటుంది. ఇలాంటి సమయంలో గుడ్డు మంచి శక్తి వనరు.
వేసవిలో రోజూ గుడ్లు తినడం మంచిదా ? చెడ్డదా ?
గుడ్లు జియాక్సంతిన్, లుటిన్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఈ యాంటీఆక్సిడెంట్ల సహాయంతో.. కంటి సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా సూర్య రశ్మి యొక్క హానికరమైన ప్రభావాల నుండి మీ కళ్ళను రక్షించడంలో ఇది సహాయపడుతుంది. గుడ్లు అవసరమైన విటమిన్లు , ఖనిజాలకు గొప్ప మూలం. మన కణజాలాల నిర్మాణం , మరమ్మత్తులో ప్రోటీన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్లలో లభించే కాల్షియం మానవ శరీరంలోని ఎముకలను బలోపేతం చేయడానికి చాలా అవసరం. కాబట్టి.. వేసవిలో గుడ్లు తినకపోవడం పెద్ద తప్పు. అది మీ శరీరంలో ఎలా నిల్వ చేయబడుతుందో.. ఎంతగా నిల్వ చేయబడుతుందో మీరు గుర్తుంచుకోవాలి.
Also Read: టూత్ బ్రష్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ !
ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఆహారంలో గుడ్లను చేర్చుకోవడంతో పాటు.. తగినంత నీరు త్రాగాలి. తద్వారా శరీరం యొక్క హైడ్రేషన్ మెరుగ్గా ఉంటుంది. దీంతో పాటు.. మీ ఆహారంలో వీలైనన్ని ఎక్కువ పండ్లు , కూరగాయలను చేర్చుకోండి. ముఖ్యంగా సమ్మర్ లో దోస కాయ, పుచ్చ కాయ, టమాటో వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి.