BigTV English

India vs Pakistan War: భారత్‌తో యుద్ధం.. పాక్ నాశనం అవుతుందా ?

India vs Pakistan War: భారత్‌తో యుద్ధం.. పాక్ నాశనం అవుతుందా ?

India vs Pakistan War : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ భయపడుతోంది. ఈ దాడి తర్వాత.. భారత సైన్యానికి చెందిన ముగ్గురు అధిపతులతో జరిగిన సమావేశంలో.. ప్రధాని మోదీ ఉగ్రవాదులపై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భారత సైన్యం పాక్ పై దాడి చేయడానికి నిర్ణీత లక్ష్యాన్ని.. ప్రదేశాన్ని నిర్ణయిస్తోంది. ప్రధాని మోదీ ఈ ప్రకటన తర్వాత.. సర్జికల్ స్ట్రైక్ విషయంలో భారత్ తీసుకున్న చర్యనే మళ్ళీ తీసుకుంటుందా అని పాకిస్తాన్ భయపడుతోంది.


భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య.. 2025 సంవత్సరానికి సంబంధించి బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతాయా అని చాలా మంది సందేహంతో ఉన్నారు. బాబా వంగా తన అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. 1911లో బల్గేరియాలో జన్మించిన బాబా వంగా ..1996లో 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. బాబా వంగా కేవలం 12 సంవత్సరాల వయసులో కంటి చూపును కోల్పోయారు. ఇదిలా ఉంటే ఆమె సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, అమెరికాలో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చేసిన 9/11 దాడితో సహా అనేక విషయాలను గురించి అంచనా వేశారు. అవి పూర్తిగా నిజమని నిరూపించబడ్డాయి కూడా.

భారత్ తో యుద్ధం జరిగితే పాకిస్తాన్ నాశనం అవుతుందా?


బాబా వంగా ప్రపంచం గురించి చాలా అంచనాలు చేశారు. కానీ ఆమె భారత్ , పాకిస్తాన్ యుద్ధం గురించి లేదా ముఖ్యంగా పాకిస్తాన్ విధ్వంసం గురించి స్పష్టమైన, ప్రామాణికమైన అంచనా వేయలేదు. కానీ ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందని బాబా వంగా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ మధ్య సంఘర్షణ పెరిగింది. ఈ దాడి తర్వాత పరిస్థితిని చూస్తుంటే.. యుద్ధ ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ సైనిక శక్తిని, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే.. పాకిస్తాన్ నాశనమై, ముక్కలుగా చీలిపోయినా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు సోషల్ మీడియాలో బాబా వంగా జోస్యానికి దీనిని అనుసంధానం చేస్తున్నారు.

బాబా వంగా అంచనా నిజం:
బాబా వంగా 2025 సంవత్సరానికి సంబంధించిన చేసిన అంచనాలలో ఐరోపాలో ఒక పెద్ద సంఘర్షణ , మానవ నాగరికత ముగింపు ప్రారంభం గురించి మాట్లాడారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం గురించి లేదా పాకిస్తాన్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదు.

Also Read: భయం గుప్పిట్లో పాక్.. ఆ దేశ సాయం కోసం ఎదురు చూపులు

మానవాళి నాశనంతో ప్రారంభమయ్యే సమయం:
ఐరోపాలో ప్రారంభమయ్యే ఆర్థిక సమస్యలు , క్రమంగా పెరుగుతాయని బాబా వంగా చెప్పారు. 5079 సంవత్సరంలో మానవ జాతి భూమి నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొన్నాడు.

2076 నాటికి వామపక్షాలు మొత్తం ప్రపంచంలో తిరిగి అధికారంలోకి వస్తాయని బాబా వంగా అంచనా వేశారు. దీని కారణంగా.. ప్రపంచంలో కమ్యూనిస్ట్ పాలన స్థాపించబడుతుంది. బాబా వంగా 5079 సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా ప్రపంచం అంతమవుతుందని అంచనా వేశారు.

Related News

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Yemen: యెమెన్ తీరంలో పడవ బోల్తా 68 మంది జల సమాధి, 74 మంది గల్లంతు

Russia Earthquake: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం.. 6000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన..?

Meta Offer: ఏంటి బాసూ.. రూ.13000 కోట్ల జాబ్ ఆఫర్ ని ఎవరైనా వదులుకుంటారా? మెటాకే షాక్ ఇచ్చాడుగా!

Big Stories

×