UP Crime News: ఓ యువకుడు ముంబైలో పని చేస్తున్నాడు. వారం కిందట సొంతూరుకి వచ్చాడు. తల్లికి ఏం చెప్పాడో తెలీదుగానీ.. గట్టిగానే కొడుకుని మందలించింది. దాన్ని అవమానంగా భావించాడు ఆ కొడుకు. ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకుని చూసి షాకైంది. కొడుకు లేని లోకంలో తాను ఉండనని భావించి విషం తీసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో జరిగింది.
స్టోరీలోకి వెళ్తే..
యూపీలో గోరఖ్‌పూర్ జిల్లాలోని కుచ్ దేహరి గ్రామంలో ఊహించని దారుణం జరిగింది. 18 ఏళ్ల మోహిత్ అనే యువకుడు ముంబైలో పని చేసేవాడు. పనిలో ఏం జరిగిందో తెలీదుగానీ వారం కిందట ఇంటికి వచ్చేశాడు. అక్కడ పని నచ్చక వచ్చానని తల్లితో చెప్పాడు. అలాగైతే ఫ్యామిలీకి కష్టాలు తప్పవని చెప్పింది. ఇంత చెప్పినా కొడుకు వినలేదు. కాసింత కోపంతో చెడా మడా కొడుకుని తిట్టేసింది.
తానేమి తప్పు చేయలేదు.. అయినా తనను ఎందుకు తిట్టిందని మనసులో బాధపడ్డాడు. తల్లి మాటలను అవమానంగా భావించాడు. బుధవారం రాత్రి మోహిత్ సోదరికి మెడిసిన్ కోసం షాపుకి వెళ్లింది తల్లి, చెల్లెలి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మోహిత్. తల్లి, చెల్లి ఇంటికి వచ్చేసరికి గదిలో శవమైన కనిపించాడు మోహిత్.. ఆపై షాకైంది.
కన్నీరుమున్నీరు, ఆపై
చిన్న మాటకే ఇంత పని చేశాడా? అంటూ కంటతడి పెట్టారు తల్లి, కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు చనిపోవడంతో తట్టుకోలేకపోయింది ఆ తల్లి. చివరకు తల్లీ కూతుళ్లు ఇద్దరు విషం తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. తల్లి, కుమార్తెను ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
ALSO READ: అడ్రస్ చెబుతామని నమ్మించి.. భర్త ఎదురుగానే భార్యపై అత్యాచారం
మోహిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కూతురు కూడా మరణించారు. మోహిత్ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు. చివరకు కొడుకు, తల్లి, కూతురు ఒకేసారి ఈ లోకాన్ని విడిచిపెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా శకసంద్రంలో మునిగిపోయింది. మోహిత్ తండ్రి అంగద్ పదేళ్ల కిందట చనిపోయాడు.
ముగ్గురి ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబానికి చెందినవారి నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు.