BigTV English

Pakistan: భయం గుప్పిట్లో పాక్.. ఆ దేశ సాయం కోసం ఎదురు చూపులు

Pakistan: భయం గుప్పిట్లో పాక్.. ఆ దేశ సాయం కోసం ఎదురు చూపులు

Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఇండియా ఎప్పుడైనా తమ దేశంపై దాడి చేయవచ్చనే భయం సైన్యం, నిఘా సంస్థలు, ప్రజలలో పెరిగింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు, సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది. భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ మనుగడ సాగించలేదని తెలినప్పటికీ ప్రపంచ దేశాల ముందు మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇదిలా ఉంటే పాక్ సాయం కోసం అమెరికా తలుపు తట్టడం గమనార్హం.


ఆందోళనలో పాక్ ప్రధాని:
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం రాత్రి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు ఫోన్ చేసి మొత్తం పరిస్థితి గురించి తెలియజేశారు. పాక్ పై భారత్ దాడి చేయకుండా ఒత్తిడి తీసుకురావాలని షరీఫ్ రూబియోకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో.. పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తులో సహకరించాలని కూడా రూబియో షరీఫ్‌ను కోరారు. దేశంలో ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించడానికి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయకుండా ఉండమని మోదీకి తెలియజేయాలని షరీఫ్ రూబియోను కోరినట్లు సమాచారం.

భారత విదేశాంగ మంత్రికి ఫోన్:
అర్థరాత్రి.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రిని కలిశారు అంతే కాకుండా జైశంకర్  మాట్లాడారు.  ఈ నేపథ్యంలోనే పహల్గామ్ లో  జరిగిన ఉగ్రదాడిని రూబియో ఖండించారు. అంతే కాకుండా ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా భారత్‌కు అండగా నిలుస్తుందని అన్నారు.  ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు రూబియో సంతాపం తెలిపారు. దీనితో పాటు.. పాకిస్తాన్‌పై పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించాలని, ప్రతీకార చర్యలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని రూబియో విజ్ఞప్తి చేశారు.


పాక్ కీలక నిర్ణయం:
పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ బుధవారం రాబోయే 24 నుంచి 36 గంటల్లో భారతదేశం పాకిస్తాన్‌పై సైనిక చర్య తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తన వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడానికి NSA బాధ్యతను ISI చీఫ్ అసిమ్ మాలిక్‌కు అప్పగించింది. ఇండియా చేసే ఏ దురాక్రమణకైనా తాము తగిన సమాధానం ఇస్తామని అత్తౌల్లా తరార్  హెచ్చరించారు.

అసిమ్ మాలిక్ ఎవరు ?
లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్ సెప్టెంబర్ 2024లో ISI చీఫ్ గా నియమించబడ్డారు. ఆయన నియామకం పాకిస్తాన్ నిఘా, సైనిక వ్యూహంలో ఒక పెద్ద మార్పు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అసిమ్ మాలిక్ ను NSAగా నియమించడంతో పాక్  భద్రతా విధానాలలో ISI ప్రభావాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. మాలిక్ కఠిన, వ్యూహాత్మక సైనిక అధికారిగా ప్రసిద్ధి చెందారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నిర్వహించడంలో దిట్ట.

Also Read: సింధు జలాల ఇష్యూ.. మోదీ ప్లాన్ అదిరిపోయిందిగా ? ఇక పాక్‌కి చుక్కలే !

పాకిస్తాన్ భద్రతా విధానంలో మార్పు:
అసిమ్ మాలిక్ నియామకంతో.. పాకిస్తాన్ భద్రతా విధానాలలో మార్పులు వస్తాయని అంతా భావిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోనున్నాయి. ఇప్పటికే రెండు దేశాల నుండి బలమైన ప్రకటనలు వస్తున్నాయి.  పాకిస్తాన్ సైన్యం , ప్రభుత్వంపై అంతర్గత ఒత్తిడి కూడా పెరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల నుండి, ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిఐ నుండి ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో మాలిక్ తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు తెస్తాయో చూడాలి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×