Today Gold Rate: మొన్నటిదాకా బంగారం అంటే అందరికీ లక్ష సౌండే వినిపించేది. తులం బంగారానికి లక్ష ఖర్చు పెట్టాలా? అని గోల్డ్ లవర్స్ అంతా కిందా మీదా పడిపోయారు. 24 క్యారెట్ గోల్డ్ లక్ష దాటడంతో.. ఇక గోల్డ్‌ని జ్యువెలరీ షాపుల్లో చూసి మురవాల్సిందే అనుకున్నారు. అయితే.. ఆల్ టైమ్ రికార్డు స్థాయి ధరను తాకిన బంగారం.. మళ్లీ నేలచూపులు చూస్తోంది. అక్షయ తృతీయ నుంచే బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ మొదలైంది. నెలరోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న గోల్డ్ రేట్లు.. పసిడి ప్రియులకు భారీ ఊరటనిచ్చాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయా? ఎంతవరకు పడిపోయే చాన్స్ ఉంది?
లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలో.. మళ్లీ డౌన్ ఫాల్ మొదలైంది. అంతెత్తుకు ఎగసి, ఆకాశాన్నంటిన గోల్డ్ రేట్లు.. పసిడి ప్రియులకు ఇప్పుడిప్పుడే ఊరటనిస్తున్నాయి. ఆల్ టైమ్ హై రేటు లక్ష నుంచి బంగారం దిగొచ్చింది. భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.95 వేల 510కి తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ గోల్డ్ రేటు 87 వేల 550కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ధర 3 వేల 307 డాలర్లకు చేరింది. అమెరికా డాలర్ బలపడటంతో గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి. యూఎస్ డాలర్ విలువ పెరగడం వల్ల.. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదైనదిగా మారింది. దాంతో.. డిమాండ్ తగ్గింది. ముఖ్యంగా.. అమెరికా-చైనా మధ్య వాణిజ్యం విషయంలో ఉద్రిక్తతలు తగ్గడం కూడా బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపించింది.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,550 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 కి చేరుకుంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,550 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,550 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87, 700 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,660 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,550 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 వద్ద పలుకుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,550 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: యూపీఐకి క్రెడిట్ కార్డ్ ఇలా లింక్ చేయండి..లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,09,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.98.000 వద్ద కొనసాగుతోంది.