BigTV English

Baba Vanga: 2025లో అల్లకల్లోలం.. బాబా వంగ ముందే హెచ్చరించింది

Baba Vanga: 2025లో అల్లకల్లోలం.. బాబా వంగ ముందే హెచ్చరించింది

బాబా వంగ జ్యోతిష్యం నిజమవుతుందా..?
2025లో జరుగుతున్న ఈ వినాశనాలన్నిటినీ ఆమె ముందుగానే అంచనా వేసిందా..?
ఆర్థిక సంక్షోభాన్ని ఆమె కచ్చితంగా పసిగట్టిందని అనుకోవచ్చా..?


ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆమె జ్యోతిష్యం నిజమని అనిపించక మానదు. 2025 అంచనాలను ఆమె ముందుగానే ఊహించి చెప్పింది, అవి ఇప్పుడు ఒక్కొక్కటే నిజమవుతున్నాయి. తాజా పరిణామాలతో బాబా వంగ జ్యోతిష్యం మరోసారి వైరల్ గా మారింది. భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో బాబా వంగ అంచనాలను మరోసారి తెరపైకి తెస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అశాంతి వాతావరణాన్ని ఆమె ముందుగానే అంచనా వేశారని చెబుతున్నారు. శత్రు దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయినా, పూర్తి స్థాయిలో శాంతి స్థాపన జరగలేదని, దీన్ని బాబా వంగ ముందుగానే చెప్పారని అంటున్నారు.

బల్గేరియాకు చెందిన అంధురాలు బాబా వంగ.. స్థానికంగా గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా పేరు తెచ్చుకుంది. 1996లో ఆమె మరణం తర్వాత ఆమె జ్యోతిష్యం మరింత పాపులర్ కావడం విశేషం. భవిష్యత్ కి సంబంధించి ఆమె చెప్పిన మాటల్ని శిష్యులు అప్పుడప్పుడు బయటపెడుతుంటారు. 2025 ఏడాదికి సంబంధించి కొన్ని విషయాలను బాబా వంగ చెప్పినట్టుగా వారు ప్రచారంలోకి తెచ్చారు.


యుద్ధాలు, ఆర్థిక అల్లకల్లోలం..
2025లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని బాబా వంగ ముందుగానే చెప్పారట. నేటి యుద్ధ పరిస్థితులు ఆమె అంచనాలను నిజం చేస్తున్నాయని అంటున్నారు నెటిజన్లు. అంతే కాదు, ఆర్థిక వైపరీత్యాల గురించి కూడా ఆమె కచ్చితంగా అంచనా వేశారట. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత జరుగుతున్న ఆర్థిక అనర్థాలను దీనికి పోల్చి చెబుతున్నారు. ట్రంప్ పన్నుల యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న సందర్భంలో ఆమె మాటలు అక్షర సత్యం అంటున్నారు.

మానవత్వం పతనం అవుతుందని, అరాచకత్వం రాజ్యమేలుతుందని బాబా వంగ ముందుగానే హెచ్చరించారు. మానవ టెలిపతి గురించి కూడా ఆమె హింటిచ్చారు. మనుషులు నేరుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే.. వారి మనస్సులు మాట్లాడుకునే టెక్నాలజీ వస్తుందని ఆమె ఊహించారు. నేడు ఎలాన్ మస్క్ పరిశోధనల్లో కీలకమైన న్యూరా లింక్ ని దీనికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు ఆమె శిష్యులు. న్యూరాలింక్ ఆవిష్కరణలు బాబా వంగ ఆలోచనలకు ప్రతిరూపమేనంటున్నారు. విమర్శకులు మాత్రం ఈ వాదనలతో ఏకీభవించట్లేదు. టెక్నాలజీ అభివృద్ధి నిరంతరం జరిగేదేనని, నూతన ఆవిష్కరణలకు బాబా వంగ జ్యోస్యాన్ని ముడిపెట్టడం సరికాదంటున్నారు. ఆమె చిన్న చిన్న పదాలను మాత్రమే చెప్పినట్టు ఆధారాలున్నాయని, ఆమె శిష్యులు మాత్రం ఆ పదాలకు నిగూఢ అర్థాలను వెదికి పట్టుకుంటున్నారని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు వాటిని ముడిపెడుతూ హైలైట్ చేస్తున్నారని అంటున్నారు.

2025లో భూకంపాలతో ప్రపంచ దేశాలు నష్టపోతాయని ఆమె ముందుగానే హెచ్చరించారు. థాయిలాండ్, మయన్మార్ భూకంపాలను ఆమె హెచ్చరికలకు ఉదాహరణలుగా చెబుతున్నారు. మిగతా విషయాల్లో ఆమె మాటల్ని విమర్శకులు తిప్పికొట్టినా.. భూకంపాలు, ఆర్థిక అస్థిరతను మాత్రం ఖండించలేకపోతున్నారు. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో బాబా వంగ జ్యోస్యాన్ని మరోసారి హైలైట్ చేస్తున్నారు. ఆమె చెప్పిందే నేడు జరుగుతోందని, 2025 మరింత అశాంతిని రేకెత్తించే ఏడాదిగా మారుతుందని అంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×