BigTV English

Boycott Maldives | భారత్ దెబ్బకు తగ్గిన మాల్దీవ్స్ ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులు సస్పెండ్!

Boycott Maldives | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ యాత్రపై ట్రోలింగ్ చేసిన ముగ్గురు మాల్దీవ్స్ మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని మోదీ, ఇండియాపై అవమానకరంగా కామెంట్స్ చేసిన ముగ్గురు మంత్రులు మరియమ్ షిఒనా, మలాషా, హసన్ జహాన్‌పై మాల్దీవ్స్ ప్రభుత్వం వేటు వేసింది.

Boycott Maldives | భారత్ దెబ్బకు తగ్గిన మాల్దీవ్స్ ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులు సస్పెండ్!

Boycott Maldives | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ యాత్రపై ట్రోలింగ్ చేసిన ముగ్గురు మాల్దీవ్స్ మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని మోదీ, ఇండియాపై అవమానకరంగా కామెంట్స్ చేసిన ముగ్గురు మంత్రులు మరియమ్ షిఒనా, మలాషా, హసన్ జహాన్‌పై మాల్దీవ్స్ ప్రభుత్వం వేటు వేసింది.


మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు వారి చేసిన కామెంట్స్‌కు ప్రభుత్వం బాధ్యత వహించదని చెబుతూ.. ఆ కామెంట్స్ వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని అన్నారు. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని అధికారికంగా మాల్దీవ్స్ ప్రభుత్వం ముందు లేవనెత్తడంతో ఈ చర్యలు తీసుకుంది.

మాల్దీవ్స్‌లో మొహమద్ మొయిజు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక భారత, మాల్దీవ్స్ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా క్షీణిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ యాత్రను టార్గెట్ చేస్తూ కొందరు మాల్దీవ్స్ మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేశారు.


ఈ ముగ్గురితో పాటు మొహమద్ మొయిజు పార్టీకే చెందిన మరో ఎంపీ జాహిద్ రమీజ్ కూడా ప్రధాని మోదీ లక్షద్వీప్ యాత్రపై అవహేళన చేశారు. ”మాల్దీవ్స్‌లో పర్యాటకుల కోసం ఇక్కడి ప్రభుత్వం అందించే సేవలు భారత్‌లో ఎక్కడ దొరుకుతాయి. మేము పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాము. మరోవైపు భారత్‌లో దుర్వాసనకే పర్యాటకులు పారిపోతారు.” అని ఎంపీ జాహిద్ రమీజ్ జనవరి 5 2024న ట్వీట్ చేశారు.

అలాగే మాల్దీవ్స్ మంత్రి మరియమ్ షిఒనా.. ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్‌లో నీటిలోపల విన్యాసాలు చేసిన ఫొటోలను ట్యాగ్ చేస్తూ.. ”ఇతను ఒక జోకర్” అంటూ అవమాపకరమైన పోస్ట్ చేసింది.

దీంతో ఇండియాలో సోషల్ మీడియా వార్ మొదలైంది. #BoycottMaldives అని బాగా ట్రెండింగ్ అయింది. రెండు రోజుల్లోనే భారత్ నుంచి మాల్దీవ్స్‌ వెళ్లే పర్యాటకులు వేల సంఖ్యలో విమాన టికెట్లు క్యాన్సెల్ చేసుకున్నారు. మాల్దీవ్స్‌లో హోటల్ బుకింగ్స్ కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాల్దీవ్స్‌కి బదులుగా లక్షద్వీప్ వెళ్లాలని సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం వంటి స్టార్ హీరోలు, సెలెబ్రిటీలు ట్వీట్లు చేశారు.

మాల్దీవ్స్‌లో కూడా మాజీ ప్రెసిడెంట్, మాజీ వైస్ ప్రెసిడెంట్లు కొత్త ప్రెసిడెంట్‌కు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని కోరారు. ఎందుకంటే మాల్దీవ్స్‌కు పర్యాటక రంగం నుంచి ప్రధాన ఆదాయం వస్తుంది. ఇప్పుడు భారతీయులు అక్కడికి పోవడానికి ఇష్టపడకపోతే వారికి భారీగా నష్టం చేకూరుతుంది. అందుకే అధ్యక్షుడు మొయిజు తన ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×