BigTV English

Virender Sehwag : మేమూ, మాకొక వంటవాడు.. ఇంగ్లాండ్ తీరుపై సెహ్వాగ్ సెటైర్లు..

Virender Sehwag : జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్- టీమ్ ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టీమ్ భారత్ లో ఏడు వారాలు గడపనుంది. దీంతో తమ ఆటగాళ్లు అనారోగ్యం పాలవకుండా తమతో పాటు ఒక వంటవాడు (చెఫ్) ని తీసుకువస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Virender Sehwag : మేమూ, మాకొక వంటవాడు.. ఇంగ్లాండ్ తీరుపై సెహ్వాగ్ సెటైర్లు..

Virender Sehwag : జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్- టీమ్ ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టీమ్ భారత్ లో ఏడు వారాలు గడపనుంది. దీంతో తమ ఆటగాళ్లు అనారోగ్యం పాలవకుండా తమతో పాటు ఒక వంటవాడు (చెఫ్) ని తీసుకువస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ తన దైన రీతిలో సెటైర్లు పేల్చాడు. తనేమంటాడంటే ఒకప్పుడు ఇంగ్లాండ్ లో కుక్ ఉండేవాడు. అతను రిటైర్ అయిపోయాడు. అందుకనే ఇప్పుడు ఈ కుక్ ని తీసుకొస్తున్నారా? అని అన్నాడు.


అంటే తన ఉద్దేశం ఒకప్పుడు ఇంగ్లాండ్ జట్టులో అలస్టర్ కుక్ అని ప్రముఖ ఆటగాడు ఉండేవాడు. తను విజయవంతమైన కెప్టెన్ మాత్రమే కాదు, బెస్ట్ ఓపెనర్ గా ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, అప్పుడు మీకు ఒక కుక్ ఉండేవాడు, ఇప్పుడు లేడు కాబట్టి, ఈ కుక్ ని (వంటవాడిని) తీసుకొస్తున్నారా? అనే అర్థంలో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఈ ఒక్కమాట అనేసి ఊరుకోలేదు. ఇప్పుడంటే కుక్ ని తీసుకొస్తున్నారు. మరి ఐపీఎల్ లో పలువురు ఇంగ్లీషు క్రికెటర్లు ఆడుతున్నారు. వారు కూడా కుక్ ని తెచ్చుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. తర్వాత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా కూడా మాట్లాడాడు. ఇండియా వచ్చే ఐపీఎల్ క్రికెటర్లు ప్రతీ ఒక్కరూ తమ వెంట సొంత చెఫ్ లను తీసుకురావడం సంప్రదాయంగా మారిపోతుందేమోనని సెహ్వాగ్ లాగే సెటైర్ వేశాడు.


ఇంతకీ విషయం ఏమిటంటే ఒకప్పటి కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఉండేవి. కాలం మారింది. వన్డే వరల్డ్ కప్ 2023 లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ నిర్వహించిన భారతదేశంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కావల్సిన వంటకాలు చేయలేదా? అనేది మనవాళ్ల ఉద్దేశం. వరల్డ్ కప్ లో సుమారు 10 దేశాలు ఆడాయి. అన్ని దేశాల ఆటగాళ్ల ఆహారపు అలవాట్లు, ఆ దేశంలో వండే ప్రత్యేక వంటకాలను మరీ మనవాళ్లు చేసి పెట్టారు.

వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ప్రతీ దేశపు ఆటగాళ్లు కూడా భారతదేశం ఆతిథ్యం చాలా బాగుందని మెచ్చుకుంటూ వెళ్లారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ అయితే అభిమానుల ఆదరణ, ఆతిథ్యం మరిచిపోలేనివని మరీ మరీ చెప్పాడు.
ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కూడా అదే మాట చెప్పాడు.

ఇప్పుడు ఐపీఎల్ లో హైదరాబాద్ కెప్టెన్ అయిన తర్వాత కూడా నాకు హైదరాబాద్ అన్నా, అక్కడ బిర్యానీ అన్నా చాలా ఇష్టమని చెప్పాడు. అలాంటిది ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు వంటవాడిని తెచ్చుకుంటాం అనేసరికి, ఇది ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదని సెటైర్లు వినిపిస్తున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×