BigTV English

Canada Lover: ఫస్ట్ లవర్ లాటరీ డబ్బులు కొట్టేసింది.. సెకండ్ లవర్ తో జంప్ అయింది

Canada Lover: ఫస్ట్ లవర్ లాటరీ డబ్బులు కొట్టేసింది.. సెకండ్ లవర్ తో జంప్ అయింది

ఈమధ్య మొగుడు నచ్చక లవర్స్ తో జంప్ అయిపోతున్న చాలామంది ఖతర్నాక్ లేడీస్ కథలు వెలుగులోకి వస్తున్నాయి. వాటన్నిటికీ మించిన కథ ఇది. ఫస్ట్ లవర్ లాటరీలో గెలిచిన డబ్బులు కాజేసి, సెకండ్ లవర్ తో లేచిపోయిన ఓ కిలేడీ లేడీ స్టోరీ ఇది. ఈ ఘటన కెనడాలో జరిగింది. లవర్ ని పూర్తిగా నమ్మి మోసపోయిన ఆ ప్రియుడు చివరకు కోర్టుకెక్కాడు. తన లాటరీ డబ్బుల్ని తన ప్రియురాలికి ఇవ్వడంలో తప్పుడు సలహా ఇచ్చారంటూ సదరు లాటరీ సంస్థపై కూడా అతడు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కుటుంబ సభ్యులెవర్నీ నమ్మకుండా, ప్రియురాలిని గుడ్డిగా నమ్మి బుక్కైపోయాడు ఈ అమాయక ప్రియుడు. పేరు లారెన్స్ క్యాంప్ బెల్. ఏడాదిన్నరగా క్రిస్టల్ అన్నామెకే అనే యువతితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ క్రిస్టల్ కి మరో లవ్ స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీని తన ఫస్ట్ ప్రియుడు లారెన్స్ కి తెలియకుండా దాచింది. ఏడాదిన్నర రిలేషన్ లో ఎక్కడా లారెన్స్ కి అనుమానం కూడా రాలేదంటే ఆమె ఎంత రహస్యంగా ఆ వ్యవహారం నడిపిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లారెన్స్ కి 30కోట్ల రూపాయల లాటరీ తగిలింది. బంపర్ లాటరీ విన్ కావడంతో అతడు ఎగిరి గంతేశాడు. అయితే సరైన ఐడీ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ అతడికి లేవు. దీన్నిబట్టి అతడు ఎంత అమాయకుడో అర్థం చేసుకోవచ్చు. తనకి అవిరెండూ లేవంటూ లాటరీ సంస్థకు సమాచారమిచ్చాడు. అయితే పక్కా ఐడీ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తిని తీసుకు రావాలని లారటీ సంస్థ సూచించింది. ఇంకేముంది, తన ప్రియురాలు క్రిస్టల్ ని తీసుకుని వెళ్లాడు. ఆమె అకౌంట్ లోకి 30కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేశాడు. లాటరీ సంస్థ నుంచి పెద్ద చెక్ తీసుకుంటూ ఫొటోలకు కూడా ఫోజులిచ్చింది ఆ జంట. ఆ తర్వాత సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసింది. అంతే కాదు, తన ప్రియురాలికి తాను ఇచ్చిన పుట్టినరోజు గిఫ్ట్ గా దాన్ని అభివర్ణించాడు లారెన్స్ క్యాంప్ బెల్.

30కోట్ల రూపాయలు ఒకేసారి కళ్లజూడటంతో క్రిస్టల్ మైండ్ మారిపోయింది. ఇంకా ఈ పాత ప్రియుడితో వ్యవహారం నెట్టుకు రావడం ఆమెకు ఇష్టం లేదు. ఎలాగూ డబ్బులు తన అకౌంట్ లోనే పడ్డాయి కాబట్టి, మరో ప్రియుడికి కబురు పెట్టింది. వారిద్దరూ కలసి అక్కడినుంచి చెక్కేశారు. ప్రియురాలు ఎంతకీ ఇంటికిి రాకపోవడంతో లారెన్స్ దిగులుపడ్డాడు. ఆమెకు ఏమైందా అని టెన్షన్ పడ్డాడు. ఆ తర్వాత ఫోన్ కూడా కలవకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు.


ప్రియురాలికోసం ఇక్కడ ప్రియుడు బాధపడుతుంటే… అక్కడ ఆమె మాత్రం మరో ప్రియుడితో సరసాల్లో మునిగిపోయింది. ఒకరోజు వారిద్దర్నీ కలసి చూసిన లారెన్స్ షాకయ్యాడు. ప్రియురాలు క్రిస్టల్ తనను మోసం చేసిందని గ్రహించాడు. డబ్బులు అడిగితే ఆమె దిక్కున్నచోట చెప్పుకోపొమ్మంది. దీంతో లారెన్స్ కోర్టుకెక్కాడు. తన ప్రియురాలు తనని మోసం చేసిందని 30కోట్ల రూపాయలు కొట్టేసిందని కేసు పెట్టాడు. లాటరీ వ్యవహారంలో సదరు సంస్థ తనకు తప్పుడు సలహా ఇచ్చిందని, తన పేరుమీద టికెట్ కొంటే, వేరే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వేశారంటూ తన పిటిషన్ లో పేర్కొన్నాడు లారెన్స్. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాపం లారెన్స్ అంటూ అందరూ అతడిపై జాలి చూపిస్తున్నారు. కుటుంబ సభ్యులను కాదనుకొని ప్రియురాలే జీవితం అనుకుంటే ఇలాగే జరుగుతుందని కొంతమంది తిట్టిపోస్తున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×