E-Paper
Advertisement

Tatkal Bookings: వామ్మో తత్కాలా? బెదిరిపోతున్న రైల్వే ప్రయాణీకులు!

Tatkal Bookings: వామ్మో తత్కాలా? బెదిరిపోతున్న రైల్వే ప్రయాణీకులు!
Advertisement

Tatkal Bookings survey:  అత్యవసర ప్రయాణాలు చేసే ప్యాసింజర్ల కోసం భారతీయ రైల్వే తత్కాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణానికి ఒక్కరోజు ముందు ఈ టికెట్లు బుకింగ్ కు అవకాశం కల్పిస్తోంది. అయితే, తక్కువ టికెట్లు, ఎక్కువ పోటీ నేపథ్యంలో క్షణాల్లోనే అయిపోతాయి. చాలా మంది తత్కాల్ టికెట్ బుకింగ్ ఓ పెద్ద స్కామ్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా తత్కాల్ బుకింగ్ మీద సిటిజన్ ఎంగేజ్‌ మెంట్ ప్లాట్‌ ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ కు ప్రయత్నించిన 10 మందిలో కేవలం నలుగురు మాత్రమే పాజిటివ్ గా స్పందించారు.

తత్కాల్ టికెట్ బుకింగ్ పై ప్రయాణీకుల అసంతృప్తి

Advertisement

తత్కాల్ బుకింగ్ టికెట్లు అత్యవసర ప్రయాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, వీటిని బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. 100 మందిలో 70 మంది ఈ విధానం బాగా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత 12 నెలల్లో 10 మందిలో ఏడుగురు ఈ పథకం కింద ఆన్‌లైన్ టికెట్లను బుక్ చేసుకోవడం కష్టమని వెల్లడించారు. బుకింగ్ విండో తెరిచిన నిమిషంలోనే అన్ని టికెట్లు అయిపోతున్నాయన్నారు. ఫలితంగా మిగతా ప్రయాణీకుల టికెట్లు వెయిట్ లిస్టులోకి వెళ్తున్నాయంటున్నారు.  అంతేకాదు, తత్కాల్ టికెట్ బుకింగ్ లో తాము చాలా సార్లు విఫలం అయినట్లు వెల్లడించారు.

తత్కాల్ బుకింగ్ కు ట్రావెల్ ఏజెంట్స్ బెస్ట్!

Advertisement

తాజా సర్వే ప్రకారం తత్కాల్ టికెట్ పొండదానికి ఉత్తమ మార్గం ట్రావెల్ ఏజెంట్స్ అని మరికొంత మంది ప్రయాణీకులు అభిప్రాయపడ్డారు. 10 మంది ప్రయాణీకులలో ముగ్గురు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ ప్రస్తుత డిజిటల్ యుగంలో తత్కాల్ బుకింగ్ పొందడానికి ప్రయాణీకులు ట్రావెల్ ఏజెంట్స్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. సాధారణ ప్రయాణీకులతో పోల్చితే వాళ్లే ఈజీగా తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నారు. తత్కాల్ బుకింగ్ వ్యవస్థ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రైల్వే మీద ఉంది” అని సర్వే సంస్థ అభిప్రాయపడింది.

55 వేల శాంపిల్స్ తో సర్వే

తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే వ్యక్తుల అనుభవాలను తెలుసుకోవడానికి ఈ దేశవ్యాప్తంగా సర్వేను నిర్వహించినట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. దేశంలోని 396కి పైగా జిల్లాల్లో ఉన్న రైల్వే ప్రయాణీకుల నుంచి సుమారు 55,000 కంటే ఎక్కువ శాంపిల్స్ తీస్తున్నట్లు తెలిపింది.  వీరిలో 63 శాతం మంది పురుషులు కాగా, 37 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. సర్వే నివేదిక ప్రకారం, 41 శాతం మంది  టైర్-1 నగరాల నుంచి ఉండగా, 29 శాతం మంది టైర్-2 నుంచి ఉన్నారు. 30 శాతం మంది టైర్-3, టైర్ 4, 5 నగరాలు, గ్రామీణ జిల్లాల నుంచి కూడా కొంత మంది నుంచి శాంపిల్స్ తీసుకున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని టికెట్లు బుక్ చేసినా, క్షణాల్లో అన్నీ అయిపోతున్నాయనే అసంతృప్తి ప్రయాణీకుల నుంచి వ్యక్తం అయ్యింది.

Read Also:  బడ్జెట్ ఫ్రెండ్లీ ఫారిన్ వెకేషన్, అదీ వీసా అక్కర్లేకుండానే!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×