E-Paper
Advertisement

Children in Disaster : విపత్తుల పడగలో చిన్నారులు

Children in Disaster : విపత్తుల పడగలో చిన్నారులు
Advertisement
Children in Disaster

Children in Disaster : ప్రకృతి వైపరీత్యాలు చిన్నారుల పాలిట శాపంలా మారాయి. తుఫాన్లు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తులతో వారికి స్థానచలనం తప్పడం లేదు. యునిసెఫ్ లెక్కల మేరకు 2016-21 మధ్య 43.1 మిలియన్ల మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు.

వాతావరణ మార్పుల కారణంగా ఇలా బాధితులయ్యే చిన్నారుల సంఖ్య వచ్చే మూడు దశాబ్దాల్లో 113 మిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రకృతి ప్రకోపం కారణంగా ఫిలిప్పీన్స్‌లో అత్యధిక సంఖ్యలో చిన్నారులు సొంతూరును వదిలేయాల్సి వచ్చింది.

Advertisement

ఇలా దాదాపు 10 మిలియన్ల మంది వలస బాట పట్టారు. భారత్ రెండో స్థానంలో నిలిచింది. 6.7 మిలియన్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారు. 6.4 మిలియన్ల మందితో చైనా మూడో స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు నిరాశ్రయులు కావడానికి ప్రధాన కారణం తుఫాన్లు, వరదలు.

ఫలితంగా ఆ ఆరేళ్ల కాలంలో దాదాపు 21.1 మిలియన్ల మంది ఆశ్రయం కోల్పోయారు.
ఇక అమెరికాలో ప్రధానంగా తుఫాన్లు, ఆ తర్వాత కార్చిచ్చుల వల్ల పిల్లలు నిలువనీడను కోల్పోతున్నారు. అలా అగ్రరాజ్యంలో 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

చైనాలో 6.4 మిలియన్ల మంది, సోమాలియాలో 1.7, ఇథియోపియా 1.3, ఇండొనేసియాలో 1 మిలియన్ మంది చిన్నారులకు ఆశ్రయం కరువైంది. ప్రకృతి వైపరీత్యాలతో కుటుంబాలు కకావికలమై.. సర్వం కోల్పోతున్న పిల్లలు దోపిడీ, లైంగిక దాష్టీకాలకు గురవుతున్నారు.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×