BigTV English

Hero of the Kibbutz : హమాస్ నుంచి కిబ్బడ్జ్ ను రక్షించిన పాతికేళ్ల యువతి.. హీరో ఆఫ్ ది కిబ్బడ్జ్

Hero of the Kibbutz : హమాస్ నుంచి కిబ్బడ్జ్ ను రక్షించిన పాతికేళ్ల యువతి.. హీరో ఆఫ్ ది కిబ్బడ్జ్

Hero of the Kibbutz : హమాస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు(Hamas Attack on Kibbutz) మొదలై ఐదురోజులు అవుతున్నా.. అక్కడి ప్రజలకు ఇంతవరకూ హమాస్ దాడుల నుంచి విముక్తి లభించలేదు. హమాస్ సంస్థకు చెందిన తీవ్రవాదులు ఆ దేశంపై వరుస దాడులతో విరుచుకుపడుతున్నారు. హమాస్ దాడుల్లో ఇప్పటి వరకూ 3500 మంది పైగా మరణించగా.. వేలాది మంది తీవ్రగాయాలతో ఆసుపత్రులపాలయ్యారు. వందలాది కుటుంబాలు నివాసాలు లేక రోడ్డునపడ్డాయి.


హమాస్ దాడులతో అక్కడి ప్రజలు వణికిపోతుంటే.. ఒక యువతి మాత్రం ధైర్యంగా హమాస్ కు ఎదురెళ్లి మరీ ఇజ్రాయెల్ పౌరులను కాపాడింది. కిబ్బడ్జ్ సెక్యూరిటీ టీమ్ కు ఉగ్రవాదులను చంపేలా నాయకత్వం వహించింది ఆ యువతి. వాలా న్యూస్ పేర్కొన్న వివరాల ప్రకారం.. 2022 డిసెంబర్ నుంచి కిబ్బడ్జ్ నిర్ యామ్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్న ఇన్ బార్ లైబర్ మ్యాన్ శనివారం (అక్టోబర్ 7) తెల్లవారుజామున భారీ శబ్దాలతో కూడిన పేలుళ్లను విన్నారు. యూదు రాష్ట్రంలో హమాస్ ఉగ్రవాదులు దాడులు ప్రారంభించిన కొద్ది సేపటిలోనే స్టెరోట్ సమీపంలో.. గాజా స్ట్రిప్ నుంచి రాయి విసిరే దూరంలో ఉన్న కిబ్బట్జ్ పై సాధారణ రాకెడ్ దాడుల శబ్దాలకంటే భిన్నమైన శబ్దాలు వినిపించడాన్ని గ్రహించింది.

వెంటనే అప్రమత్తమైన ఆమె.. కిబ్బడ్జ్ సెక్యూరిటీ టీమ్ వద్దకు వెళ్లింది. అక్కడున్న ఆయుధగారాన్ని తెరిచి.. 12 మంది సభ్యుల భద్రతా బృందానికి తుపాకీలను పంపిణీ చేసింది. పాతికేళ్ల యువతి నేతృత్వంలో సెక్యూరిటీ సిబ్బంది మొత్తం హమాస్ ఉగ్రవాదులపై అటాక్ చేశారు. వారిపై ఆకస్మిక దాడులు చేసి ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చింది. ఈ క్రమంలో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత నాలుగు గంటల్లో సెక్యూరిటీ సిబ్బంది మరో 20 మంది టెర్రరిస్టులను కాల్చి చంపారు. పాతికేళ్ల సెక్యూరిటీ కో ఆర్డినేటర్ అయిన ఇన్ బార్ లైబర్ మాన్ కిబ్బట్జ్ లో ప్రజలను కాపాడేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టడంతో.. ఆమెను హీరో ఆఫ్ ది కిబ్బడ్జ్ గా కొనియాడుతున్నారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×