BigTV English

Jaahnavi Kandula: జాహ్నవి కందుల మృతి కేసు.. ఆ పోలీసు అధికారిపై నో యాక్షన్..

Jaahnavi Kandula: జాహ్నవి కందుల మృతి కేసు.. ఆ పోలీసు అధికారిపై నో యాక్షన్..
Jaahnavi Kandula Death Case

Jaahnavi Kandula Death Case(Latest telugu news): అమెరికాలో ఏపీకి చెందిన జాహ్నవి కందుల అనే మహిళ ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణంపై పెను వివాదం చెలరేగింది. 2023 జనవరిలో సియోటెట్ ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల పెట్రోలింగ్ వెహికిల్ ఢీకొట్టడంతో ఆమె మృత్యువాత పడింది.


జాహ్నవి కందుల మృతిపై పోలీసులు ఎలాంటి నేరాభియోగాలు నమోదు చేయలేదు. ఆరోజు ఆమెను ఢీకొట్టి పెట్రోలింగ్ వెహికిల్ నడిపిన పోలీసుపై నేరాభియోగాలు మోపడం లేదని అమెరికా స్పష్టత ఇచ్చింది. ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్‌ డవేపై ఎలాంటి యాక్షన్ ఉండబోదని తేల్చేసింది. సాక్ష్యాలు లేకపోవడం వల్లే డవేపై నేరం మోపడంలేదని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం తెలిపింది. సీనియర్‌ అటార్నీలతో ఈ ఘటనపై విచారణ జరిపామని పేర్కొంది. అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ గట్టిగా నవ్విన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. జాహ్నవి ప్రాణానికి ఉన్న విలువను తక్కు చేస్తూ హేళన చేశాడు సదరు అధికారి. ఆమె మామూలు వ్యక్తే.. ఈ చావుకు విలువలేదని మాట్లాడాడు. డేనియల్ చేసిన ఈ కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అతడిపై యాక్షన్ తీసుకోవాలని భారత్ ప్రభుత్వం కోరింది.


Read More: వెనుజువెలాలో కూలిన గని.. 14 మంది బలి..

నేరుగా భారత్ ప్రభుత్వమే స్పందించడంతో అప్పట్లో అమెరికా అధికారులు డేనియల్ అడెరెర్ పై చర్యలు తీసుకున్నారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అయితే తుదిపరి చర్యల అంశం మాత్రం న్యాయస్థానం పరిధిలో ఉంది.

మరోవైపు జాహ్నవి మృతిపై హేళనగా కామెంట్స్ చేసిన పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్ ప్రమాదం జరిగినప్పుడు లేరని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ వెల్లడించారు. డేనియల్ చేసిన కామెంట్స్ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. పోలీసులపై ప్రజల్లో నమ్మకంగా తగ్గేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. అతనిపై మార్చి 4న న్యాయస్థానంలో తుదిపరిపై విచారణ జరగనుంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×