BigTV English

Tata Altroz Features: ఏంటి భయ్యా ఇది.. ఆల్ట్రోజ్ లో ఇన్ని ఫీచర్లు ఉన్నాయా..? నేనెపుడు చూడలే!

Tata Altroz Features: ఏంటి భయ్యా ఇది.. ఆల్ట్రోజ్ లో ఇన్ని ఫీచర్లు ఉన్నాయా..? నేనెపుడు చూడలే!

Tata Altroz ​​Racer has Released 2 New Variants: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా పలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి దించుతూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లను అందించి అందిరినీ అట్రాక్ట్ చేస్తోంది. అయితే తమ క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు కంపెనీ రీసెంట్‌గా మరొక అద్భుతమైన ఫీచర్లతో కొత్త కారును రిలీజ్ చేసింది. జూన్ 7న టాటా ఆల్ట్రోజ్ రేసర్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది.


ఈ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లో రెండు కొత్త వేరియంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. XZ LUX, XZ+ LUX అనే రెండు కొత్త వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా టాప్-స్పెక్ XZ+ OS మునుపటి కంటే ఎక్కువ ఫీచర్లను పొందుతుంది. ఇక టాటా ఆల్ట్రోజ్ XZ LUX వేరియంట్ రూ.9 లక్షల ధరతో అందుబాటులో ఉంది. అలాగే టాటా ఆల్ట్రోజ్ XZ+ LUX వేరియంట్ రూ.9.65 లక్షల ధరతో లభిస్తుంది. దీంతోపాటు ఆల్ట్రోజ్ XZ+ OS వేరియంట్ రూ.9.99 లక్షల ధరతో ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే.

టాటా ఆల్ట్రోజ్ XZ LUXలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఆల్ట్రోజ్ XZ LUX వేరియంట్‌ ఇతర ఫీచర్లతో పాటు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. కాగా ఆల్ట్రోజ్ XZ+ OS, XZ+ LUX వేరియంట్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్‌, IRA కనెక్టెడ్ కార్ టెక్ వంటివి ఇంతకముందు కంటే రూ. 34,000 ప్రీమియం ధరను కలిగి ఉన్నాయి. అయితే కంపెనీ ఇందులోని టర్బో పెట్రోల్, మాన్యువల్ వేరియంట్ల ధరలను కూడా వెల్లడించింది.


Also Read: స్పోర్టీ లుక్‌లో ఫిదా చేస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్.. బుకింగ్స్ ఓపెన్ అయ్యయండోయ్..!

పెట్రోల్ డీసీఏ, పెట్రోల్ మాన్యువల్, డీజిల్, సీఎన్జీ పవర్‌ట్రెయిన్ వంటి ఆప్షన్లలో మరికొన్ని వేరియంట్లు అందుబాటులో ఉంటాయని టాటా కంపెనీ తెలిపింది. అలాగే XZ+ OS కేవలం పెట్రోల్ ఇంజన్‌లో అందించనున్నట్లు టాటా తెలిపింది. కాగా కొత్తగా లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ రేసర్ అద్భుతమైన డ్యూయల్-టోన్ ఆరెంజ్, బ్లాక్ థీమ్‌ని కలిగి ఉంది. ఈ కొత్త ఆల్ట్రోజ్ రేసర్ అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే అనే 3 కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. అంతేకాకుండా ఇంటీరియర్‌ కూడా అదే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్‌తో వస్తుంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×