E-Paper
Advertisement

మౌంట్ ఎవరెస్ట్ వ్యవహారం.. బయటపడుతున్న స్కామ్, అడ్డంగా బుక్కైన 32 మంది

మౌంట్ ఎవరెస్ట్ వ్యవహారం.. బయటపడుతున్న స్కామ్, అడ్డంగా బుక్కైన 32 మంది
Advertisement

Mt Everest: ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ . దీని పేరిట జరుగుతున్న భారీ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన కొందరు గైడ్‌లు శిఖరంపైకి తీసుకెళ్లేవారిని మోసగించినట్టు వార్తలు జోరందుకున్నాయి. అంతేకాదు కోట్లాది రూపాయల ఇన్సూరెన్స్ స్కామ్ చేసినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏకంగా రూ.186 కోట్లు కుంభకోణానికి పాల్పడినట్టు బయటపడింది.

ఎవరెస్టు పేరిట బిగ్ స్కామ్.. రూ. 186 కోట్లు

Advertisement

మౌంట్ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రతీ ఏటా వేలాది మంది విదేశీ పర్వతారోహకులు నేపాల్ వస్తుంటారు. శిఖరాన్ని చేరుకునేంది కొంతమంది మాత్రమే. ఖాఠ్మండు పోస్ట్ ప్రకారం.. యాత్ర పేరిట ట్రెకింగ్ ఏజెన్సీల దోపిడీని బయట పెట్టినట్టు రాసుకొచ్చింది. దాదాపు 20 మిలియన్ డాలర్ల కుంభకోణం జరిగినట్టు పేర్కొంది.

దీనికి సంబంధించి ట్రెకింగ్ ఆపరేటర్లు, ఆసుపత్రి సిబ్బందితో సహా మొత్తం 32 మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి. ట్రెకింగ్ ఏజెన్సీల గైడ్‌లు పర్యాటకుల భోజనంలో బేకింగ్ సోడా కలిపారన్నది ప్రధానమైన పాయింట్. దీనివల్ల పర్వాతారోహకులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు అధికారులు తెలిపారు. ఏజెన్సీల ఇచ్చిన ఆహారం తీసుకున్న పర్యాటకులు అనారోగ్యానికి గురైన సందర్భాలు లేకపోలేదు.

Advertisement

అడ్డంగా బుక్కైన 32 మంది.. అందులో హెలికాప్టర్ నిర్వాహకులతోపాటు

వారిని తరలింపు సమయంలో ఖరీదైన హెలికాప్టర్ ఉపయోగించాలని వారిపై ఒత్తిడి తెచ్చేవారట. అంతేకాద బీమా చెల్లింపులు క్లెయిమ్ చేయడానికి ఆపరేటర్లు నకిలీ వైద్యం, విమాన పత్రాలను ఉపయోగించారని అధికారుల ప్రధాన ఆరోపణ.  ఈ విధంగా వచ్చే అక్రమ సంపాదన సొమ్మును గైడ్‌లు, హెలికాప్టర్ కంపెనీలు, ట్రెకింగ్ ఏజెన్సీలు, పర్యాటకులకు నకిలీ వైద్యులు పంచుకునేవారని పేర్కొంది.

దీనిపై జనవరిలో దర్యాప్తు మొదలైంది.  మూడు ప్రధాన పర్వత రక్షణ సంస్థలకు చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లు నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఎవరెస్ట్ స్కామ్‌ తీగలాగితే డొంక కదిలింది. మోసపూరిత క్లెయిమ్‌ల రూపంలో సుమారం 19.69 మిలియన్ డాలర్లు సమకూరినట్లు సమాచారం. భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.186 కోట్లు అన్నమాట.

ALSO READ: ఇరాన్‌పై దాడులు ముమ్మరం.. అతిపెద్ద వంతెన పేల్చివేసిన బలగాలు

నేపాల్ పర్యాటక రంగం 10 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.  మోసాల కారణంగా పలు అంతర్జాతీయ బీమా సంస్థలు ట్రెకింగ్ టూరిస్టులకు కవరేజీని నిరాకరించాయి. 2018 ఏడాది తర్వాత అత్యవసర సమయాల్లో టూరిస్టులను తరలింపు విషయంలో మధ్యవర్తులను తొలగించింది ప్రభుత్వం. టూర్ ఆపరేటర్లు ఈ బాధ్యతను తీసుకోవాలని రక్షణ, చికిత్స వివరాలను పర్యాటక శాఖకు సమర్పించాలని ఆదేశించింది.

నేపాల్ నేర విభాగం అధిపతి మనోజ్ కుమార్ ఓ పత్రికతో మాట్లాడారు. దేశ ప్రతిష్టను వారు దెబ్బతీశారని అన్నారు. 2022-25 మధ్యకాలంలో 300కు పైగా జరిగాయని తెలిపారు. నేపాల్ పోలీసులు గతేడాది ఈ కేసును తిరిగి తెరిచిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని నిర్ధారించారు. దీంతో లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు నేపాల్ పోలీసులు. పర్వతారోహణ సీజన్‌లో దాదాపు 500 మంది పర్వతారోహకులు వస్తారని ఓ అంచనా.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×