E-Paper
Advertisement

ఇరాన్‌పై దాడులు ముమ్మరం.. అతిపెద్ద వంతెన పేల్చివేత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ

ఇరాన్‌పై దాడులు ముమ్మరం.. అతిపెద్ద వంతెన పేల్చివేత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ
Advertisement

Iran Vs America war: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టుగా చేస్తున్నారు. ఇరాన్ యుద్దాన్ని రెండు లేదా మూడు వారాల్లో ముగిస్తామని తేల్చి చెప్పారు. అన్నట్లుగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక బలగాలు దాడులు ముమ్మరం చేశాయి. తాజాగా ఇరాన్‌లో అతి పెద్ద వంతెనను పేల్చివేశాయి అమెరికా బలగాలు.

ఇరాన్‌పై దాడులు ముమ్మరం చేసిన అమెరికా-ఇజ్రాయెల్

Advertisement

ఇరాన్‌ను రాతియుగానికి నెట్టేస్తామని చెప్పిన కొన్ని గంటల తర్వాత ఆ దేశంలో ఎత్తైన వంతెనను ధ్వంసం చేశాయి అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు. ఈ విషయాన్ని గురువారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. టెహ్రాన్‌కు నైరుతి దిశలో సుమారు 20 మైళ్ల దూరంలో ఉన్న కరాజ్‌లోని బి1 వంతెన నుండి పొగలు వెలువడుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ చర్చలకు రాకపోతే మరింత విధ్వంసం జరుగుతుందని హెచ్చరించారు కూడా.

ఇరాన్‌‌పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన అతిపెద్ద వంతెనపై భీకర దాడులు చేశాయి. దీంతో ఆ వంతెన బాగా డ్యామేజ్ అయ్యింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. వంతెన పేల్చివేసిన విషయాన్ని ఇరాన్‌ మీడియా ధ్రువీకరించింది. ఈ వంతెనను రెండుసార్లు దాడులు చేశాయని తెలిపింది.

Advertisement

ఇరాన్‌లో అతిపెద్ద వంతెన పేల్చివేత.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ

తొలిసారి జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మరణించారు. ఆ ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది వెళ్లగా మరోసారి దాడి జరిగిందని వెల్లడించింది. ఇప్పుడు చేసిన దాడిలో ఎనిమిది మంది మరణించగా, 95 మంది గాయపడ్డారు. పశ్చిమాసియాలోని ఇది అతి పెద్ద వంతెన. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నట్లు ఆదేశ మీడియా చెబుతోంది. 136 మీటర్లతో నిర్మిస్తున్న ఈ వంతెన మధ్యప్రాచ్యంలో అత్యంత ఎత్తైనది.

రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమాన కారజ్‌ సిటీతో అనుసంధానం చేస్తున్నారు. వంతెనపై దాడి చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అసంపూర్తిగా ఉన్న కట్టడాలపై దాడి తప్పుబట్టింది. దాడికి గురైన ప్రతి వంతెనను పునర్నిర్మిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తెలియజేశారు. ఇలాంటి దాడులు తాము లొంగిపోయేలా చేయవని స్పష్టం చేశారు. చెల్లాచెదురైన శత్రువు ఓటమిని, నైతిక పతనాన్ని ఈ ఘటన తెలియ జేస్తుందన్నారు.

ALSO READ: క్లైమాక్స్‌లో ఇరాన్ యుద్ధం.. ట్రంప్ మాటలు ఒకలా, మొజ్తాబా ఖమేని మాటలు మరొకలా

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×