E-Paper
Advertisement

Philippines Ferry Accident: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం..సముద్రంలో మునిగిన ఫెర్రీ, గల్లంతైనవారి

Philippines Ferry Accident: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం..సముద్రంలో మునిగిన ఫెర్రీ, గల్లంతైనవారి
Advertisement

Philippines Ferry Accident: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 350 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వారికి కోసం గాలింపు చేపట్టారు. సహాయక బృందాలు 200 మందిని సురక్షించారు. అసలు ఘటన ఎలా, ఎక్కడ జరిగింది?

ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం.. సముద్రంలో మునిగిన ఫెర్రీ

Advertisement

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి ఓ ఫెర్రీ బయలుదేరింది. మార్గమధ్యలో బలుక్‌బలుక్ ద్వీపం సమీపంలోకి రాగానే ఏం జరిగిందో తెలీదుగానీ ఫెర్రీ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీశారు. 43 మంది ఆచూకీ తెలియకుండా పోయింది.

మరో 250 మందిని కాపాడారు. ఫెర్రీ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్ యూనిట్లు, నౌకలు, మత్స్యకారులు రంగంలోకి దిగారు. వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. తప్పిపోయిన డజన్ల కొద్దీ వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు అధికారులు.  ఘటన సమయంలో ఫెర్రీలో 332 మంది ప్రయాణికులు, 27 మంది సిబ్బంది ఉన్నారని PCG విభాగం తెలిపింది.

Advertisement

15 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు

ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతామన్నారు. జాంబోంగా పోర్టులో ఫెర్రీని కోస్ట్ గార్డ్ అధికారులు తనిఖీ చేశారని చెప్పారు. ఓవర్‌ లోడింగ్ సంకేతాలు ఏవీ లేవని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా ఫెర్రీ మునిగిపోయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

ప్రాణాలతో బయటపడిన వారిని చాలామందిని బోట్లలో తీసుకొచ్చినట్టు కోస్ట్ గార్డ్ కమాండర్ తెలిపారు. బాసిలాన్ ప్రావిన్షియల్ గవర్నర్ మాట్లాడుతూ ఫెర్రీ ఘటనలో వెలికితీసిన మృతదేహాలను ప్రావిన్షియల్ రాజధాని ఇసాబెలాకు తీసుకొచ్చామన్నారు.

ALSO READ: అమెరికాలో దారుణం.. రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు

ఫిలిప్పీన్స్ ద్వీప సమూహంలో ఫెర్రీల ప్రమాదాలు సర్వసాధారణం మారాయి. మారుమూల ప్రావిన్సులలో తరచుగా తుఫానులు, సరైన నిర్వహణ లేని ఓడలు ట్రావెల్ చేస్తున్నాయి. డిసెంబర్ 1987లో మధ్య ఫిలిప్పీన్స్‌లో ఇంధన ట్యాంకర్‌ను ఢీకొని డోనా పాజ్ అనే ఫెర్రీ మునిగిపోయింది. ఈ ఘటనలో 4,300 మందికి పైగా మరణించారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఘటనల్లో ఇది ఒకటి.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×