E-Paper
Advertisement

Indonesia News: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి, అందులో ఉన్నవారంతా

Indonesia News: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి, అందులో ఉన్నవారంతా
Advertisement

Indonesia News: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సులవేసీ ద్వీపంలో ఉన్న ఓల్డేజ్ హోమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 16 మంది వృద్ధులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇండోనేషియాలోని భారీ అగ్నిప్రమాదం

Advertisement

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఎమిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.

రాత్రి వేళ కావడంతో వృద్ధులంతా తమ గదుల్లో నిద్రిస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలకు బయటకు రాలేక అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు చెప్పారు. అధికారులు, స్థానికులు సకాలంలో స్పందించి 12 మందిని కాపాడారు. మృతులను గుర్తించడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఓల్డేజ్ హోమ్‌లో ఘటన.. 16 మంది మృతి

మృతదేహాలను తరలించిన ఆసుపత్రిని సంప్రదించాలని బాధితుల కుటుంబాలను కోరారు అధికారులు. వారిలో చాలామందిని గుర్తించ లేని విధంగా ఉన్నారని స్థానిక అధికారి ఓ వార్తా సంస్థకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడు. నర్సింగ్ హోమ్ వంటగదికి తాము చేరుకున్నామని తెలిపాడు.

ఎదురుగా ఉన్న ఓల్డేజ్ హోమ్‌లో రాత్రి దాదాపు 8 గంటల సమయంలో మంటలు చెలరేగుతున్నట్లు గమనించారు. సహాయం కోసం వారి గట్టిగా కేకలు వేశారని తెలిపాడు. కేవలం ఐదు నిమిషాల్లో మంటలు భవనాన్ని చుట్టుముట్టాయని పేర్కొన్నాడు. 17 వేల ఎక్కువ దీవులతో కూడినది ఇండోనేషియా.

ALSO READ: బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పుపెట్టిన అల్లరి మూకలు

ఈ ప్రాంతంలో అగ్నిప్రమాదానికి చోటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. డిసెంబర్ నెల ప్రారంభంలో ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఏడు అంతస్తుల కార్యాలయ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది మరణించిన విషయం తెల్సిందే.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×