E-Paper
Advertisement

Donald Trump: శృంగార తారతో ట్రంప్‌ అక్రమ సంబంధం.. నిజమేనని తేల్చిన కోర్టు

Donald Trump: శృంగార తారతో ట్రంప్‌ అక్రమ సంబంధం.. నిజమేనని తేల్చిన కోర్టు
Advertisement

Former US President Donald Trump Found guilty: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కేసులో దోషిగా తేలారు. ప్రముఖ శృంగార తార స్టార్మీ డేనియల్ తో అక్రమ సంబంధం కేసులో ఆయనపై నమోదైనటువంటి అన్ని ఆరోపణలు కూడా రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. సుమారుగా 34 అంశాల్లో ఆయనను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఈ మాదిరిగా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన జో బైడెన్ తో పోటీ పడనున్నారు. మరో ఐదు నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ తీర్పు వెలువడడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంగా మారింది.

స్టార్మీతో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ అంశానికి సంబంధించి ఆమె నోరు విప్పకుండా ఆమెకు పెద్ద మొత్తంలో ట్రంప్ డబ్బు అప్పజెప్పారంటూ అభియోగాల్లో పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా స్టార్మీకి ఆ డబ్బులు ఇప్పించారని తెలిపారు. ఇందుకోసం బిజినెస్ రికార్డులన్నిటినీ కూడా తారుమారు చేశారంటూ ప్రధాన ఆరోపణ ఉంది. ఈ విధంగా మొత్తం 34 అంశాల్లో ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ తో అక్రమ సంబంధం వాస్తవమేనని స్టార్మీ డేనియల్స్ స్వయంగా కోర్టుకు తెలిపింది. సుదీర్ఘ విచారణ తరువాత ఇవన్నీ కూడా నిజమేనని కోర్టు తాజాగా తేల్చి చెప్పింది.

Advertisement

ఈ కేసులో దోషిగా తేలడంతో ట్రంప్ జెలుకెళ్లాల్సిందేనా? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమైతుంది. అయితే, దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేమంటూ నిపుణులు చెబుతున్నారు. జులై 11న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనున్నది. బిజినెస్ రికార్డును తారుమారు చేయడమనేది అక్కడ తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. నాలుగేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని, దీనిపై విచక్షణాధికారం న్యాయమూర్తిదేనని, అదేవిధంగా ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమంటూ అక్కడి న్యాయ నిపుణులు చెబుతున్నారు.

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశముందని పేర్కొంటున్నారు. ఒకవేళ జైలు శిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. మరో మూడు కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇవేవీ కూడా ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదంటూ ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు.

Advertisement

కాగా, ఈ తీర్పు విషయమై ట్రంప్ మాట్లాడుతూ.. ఇది అవమానకరమంటూ ఆయన కొట్టిపారేశారు. ఓ వివాదాస్పదమైన న్యాయమూర్తి జరిపిన విచారణ ఇది అంటూ ట్రంప్ ఆరోపించారు. అసలైన తీర్పు నవంబర్ 5 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని ట్రంప్ అన్నారు.

Also Read: చైనాలో మరో కొత్త వైరస్‌.. సోకితే 3 రోజుల్లోనే మరణం

ఇటు జోబైడెన్-హారిస్ ప్రచార బృందం ఈ తీర్పుపై మాట్లాడుతూ.. తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎవరూ చట్టానికి అతీతులు కారనే విషయం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×