BigTV English

NIU N Play: రూ.46 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ తెలిస్తే వదలరు!

NIU N Play: రూ.46 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ తెలిస్తే వదలరు!

NIU N Play Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాలకు ఆటోమొబైల్ మార్కెట్ ఎవరూ ఊహించని డిమాండ్ ఏర్పడింది. వీనియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతున్నారు. దీంతో కంపెనీలు కూడా కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా వాహనాలను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనీస్ మార్కెట్‌లో NIU కొత్త N Play ఎలక్ట్రిక్ స్కూటీని ప్రవేశపెట్టింది. అంతే కాకుండా దీన్ని అత్యధిక తగ్గింపు ధరతో అందించనుంది. భారత్ మార్కెట్‌లోనూ త్వరలో విడుదల చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాట్ వైట్, మ్యాట్ గ్రే, మ్యాట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.


NIU N Play Price
NIU Play ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 4,399 యువాన్ (సుమారు రూ. 50,561). అయితే,ఇది ప్రస్తుతం 4,047 యువాన్లకు (సుమారు రూ. 46,563) విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను చైనాలో JD.com వంటి రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటీపై తగ్గింపు ఎంతకాలం కొనసాగుతుందో ఎన్‌ఐయు వెల్లడించలేదు. ప్రస్తుతం NIU N Play ఎలక్ట్రిక్ స్కూటర్ గ్లోబల్ మార్కెట్‌లోకి ఎప్పుడు తీసుకొస్తారనేది ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

NIU N Play Engine, Range
NIU N Play స్కూటీలో 1,200W ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 2,000 అత్యధిక పవర్, 112 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 52 కి.మీ. ఇది 72V 23Ah లెడ్-యాసిడ్ బ్యాటరీని కలిగి ఉంది. రేంజ్ గురించి చెప్పాలంటే ఈ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 కి.మీ. బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ముందు, వెనుక డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను తీసుకొచ్చారు. బైక్ డబుల్ ఆర్మ్ ఫెన్స్ ఫ్రేమ్, 90/90-12 వెడల్పు గల స్పోర్ట్స్ టైర్లను కలిగి ఉంది. మోటార్‌సైకిల్‌లో 58 సెం.మీ సీటు, సీట్ బకెట్ సామర్థ్యం 20 లీటర్లు.


Also Read:  73కిమీ మైలేజ్‌తో కొత్త స్ప్లెండర్ లాంచ్.. స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

NIU N Play Features
NIU N Play ఎలక్ట్రిక్ మోటార్‌ స్కూటర్‌లో 360-డిగ్రీల ఫుల్ LED లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో LED హెడ్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ టెయిల్‌లైట్లు, హై-మౌంటెడ్ టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో క్రూయిజ్ కంట్రోల్, పుషింగ్ అసిస్ట్, రివర్సింగ్ అసిస్ట్ ఉన్నాయి. Niu N Playలోని ఇతర ఫీచర్లు బ్లూటూత్ సెన్సింగ్ కీ, సైడ్ స్టాండ్ సెన్సింగ్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ ఫోక్ లాక్, రిమోట్ పవర్ ఆన్/ఆఫ్,  రిమోట్ కంట్రోల్ సీట్ బకెట్ ఓపెనింగ్ ఉంది.

Tags

Related News

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Big Stories

×