BigTV English

VV Vinayak: గుర్తుపట్టలేనంతగా మారిన స్టార్ డైరెక్టర్.. వీడియో వైరల్

VV Vinayak: గుర్తుపట్టలేనంతగా మారిన స్టార్ డైరెక్టర్.. వీడియో వైరల్

VV Vinayak:అప్పుడు, ఇప్పుడు కాదు.. ఎప్పుడైనా మాస్ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే.. వివి వినాయక్ పేరు లేకుండా ఆ చర్చ ముగియదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఆది సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వినాయక్.. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్తా బ్లాక్ బస్టర్ అందించి రికార్డ్ క్రియేట్ చేసాడు. చిటికె వేస్తే గాల్లో సుమోలు లేవడం.. వినాయక్ సృష్టించిన మాస్ ఎలివేషన్స్ లో ఒకటి.


మొదటి సినిమాతోనే రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత నితిన్ తో దిల్.. చిరుతో ఠాగూర్ సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్స్ ను అందుకున్నాడు. స్టార్ హీరోలు మాస్ హీరోలుగా మారింది వినాయక్ చేతిలో పడ్డాకే అని చెప్పొచ్చు. వెంకటేష్ కు లక్ష్మీ.. బాలయ్యకు చెన్నకేశవరెడ్డి.. రవితేజకు కృష్ణ.. ఎన్టీఆర్ కు అది,అదుర్స్.. బన్నీకి బద్రీనాథ్..ఇలా మంచి సినిమాలను అందించిన వినాయక్.. డైరెక్టర్ గా గ్యాప్ తీసుకొని హీరోగా కూడా మారాడు.

అప్పట్లో శీనయ్య పేరుతో వినాయక్ మొదటి సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అది రిలీజ్ అవ్వకముందే ఆగిపోవడంతో వినాయక్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మధ్యమధ్యలో కనిపించినా ఆయనలో ఏదో తెలియని వెలితి కనిపించేది. ఇక గత కొంతకాలంగా వినాయక్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వినాయక్ పూర్తిగా మారిపోయాడు.


బొద్దుగా ఉండే మనిషి బక్కచిక్కి కనిపించాడు. తాజాగా నేడు కృష్ణ జయంతి కావడంతో ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. కృష్ణగారికి తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలిపాడు. అయితే ఈ వీడియోలో వినాయక్ ను గుర్తుపట్టడం కష్టం అనే చెప్పాలి. ఆయన రూపురేఖలు చాలా మారిపోయాయి.

ఇక సడెన్ గా వీడియో చూసి ఆయన వినాయక్ అని గుర్తుపట్టడం కష్టం. కొన్ని అనారోగ్య కారణాల వలన వినాయక్ అలా అయ్యాడని తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు వినాయక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×