E-Paper
Advertisement

Michaela Benthaus: వీల్ చైర్ లో స్పేస్ లోకి.. చరిత్ర సృష్టించిన దివ్యాంగురాలు

Michaela Benthaus: వీల్ చైర్ లో స్పేస్ లోకి.. చరిత్ర సృష్టించిన దివ్యాంగురాలు
Advertisement

Michaela Benthaus: అంతరిక్ష యాత్ర అంటే ఆషామాషి కాదు.. అలాంటిది ఓ దివ్యాంగురాలు స్పేస్‌‌లోకి వెళ్లి విజయవంతంగా తిరిగివచ్చింది. చరిత్ర సృష్టించింది. సంకల్పం ముందు ఎలాంటి లక్ష్యం అయినా చిన్నబోవాల్సిందే అన్న సామెతకు.. జర్మనీకి చెందిన మిచెల్లా బెన్ తావూస్ జీవితం సరిగ్గా సరిపోతుంది.

సాహసాలంటే మిచెల్లాకు చిన్నప్పటి నుంచే అమితమైన ఆసక్తి. ముఖ్యంగా మౌంటెన్ బైకింగ్ అంటే ఆమెకు ప్రాణం. ప్రమాదకరమైన మార్గాల్లోనూ ధైర్యంగా బైక్ నడుపుతూ ఎన్నో సాహస యాత్రలు చేసింది. అయితే ఈ సాహసాలు చేసే క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెన్నెముకకు తీవ్రమైన దెబ్బ తగలడంతో, ఇక జీవితాంతం వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

Advertisement

అయితే తనకు ఎప్పటినుంచో స్పేస్ కి వెళ్లాలన్నది డ్రీమ్. కానీ ప్రమాదం జరగడంతో ఎలా అని ఆలోచించారు కుటుంబ సభ్యులు, స్నేహితులు.

వీల్‌చైర్‌లో ఉన్న మహిళ స్పేస్‌కు వెళ్లడం అసాధ్యమని చాలామంది భావించారు. కానీ మిచెల్లా ఆ మాటలను అంగీకరించలేదు. ప్రమాదం తన శరీరాన్ని మాత్రమే గాయపరిచిందని, తన సంకల్పాన్ని కాదని ఆమె స్పష్టంగా చెప్పింది. అంతరిక్ష యాత్ర కోసం అవసరమైన శిక్షణ గురించి తెలుసుకుంది. వైద్యులు, నిపుణులతో సంప్రదించింది. తన శారీరక పరిమితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటు మానసికంగా కూడా తన్నుతాను సిద్ధం చేసుకుంది.

Advertisement

ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం చివరకు ఫలించింది. అమెరికా టెక్సాస్ నుంచి, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ (Blue Origin) స్పేస్ షిప్‌లో మిచెల్లాకు అంతరిక్ష యాత్ర చేసే అవకాశం లభించింది. ఇది ఆమె జీవితంలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ ఓ ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. దివ్యాంగురాలైన మిచెల్లా, అంతరిక్ష సరిహద్దుగా పిలిచే “కార్మాన్ లైన్” దగ్గర వరకు వెళ్లి, తిరిగి భూమికి సురక్షితంగా చేరుకుంది.

స్పేస్‌లో గడిపిన క్షణాలు తన జీవితంలోనే అత్యంత అద్భుతమైన అనుభూతి అని మిచెల్లా వెల్లడించింది. భూమిని పై నుంచి చూడడం, గురుత్వాకర్షణ లేని పరిస్థితిలో తేలుతూ ఉండటం తాను ఎంతో ఆస్వాదించినట్లు చెప్పింది. నా శరీరం వీల్‌చైర్‌లో ఉన్నా, నా కలలు మాత్రం రెక్కలు కట్టుకుని అంతరిక్షంలోకి ఎగిరాయి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తినిచ్చాయి.

మిచెల్లా బెన్ తావూస్ కథ ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. దివ్యాంగులపై ఉన్న అభిప్రాయాలను మార్చే శక్తివంతమైన సందేశం ఇది. శారీరక పరిమితులు మన లక్ష్యాలకు అడ్డుకావు అని, నిజమైన అడ్డంకి మన మనసులోనే ఉంటుందని ఆమె నిరూపించింది. తన ప్రయాణం ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు, యువతకు, కలలు కనే ప్రతి ఒక్కరికీ మిచెల్లా ఓ దీపంలా మారింది.

 

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×