Telangana News: తెలంగాణలో రాజకీయాల్లో నేతల మధ్య మాటలు హద్దు దాటుతున్నాయా? మత సామరస్యాన్ని చెడగొడుతున్నారా? ఇతర మతాలను కించపరచకుండా ఉండేలా కొత్త చట్టం రాబోతోందా? అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లు రానుందా? ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం వెనుక అసలు కారణమేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది వెంటాడుతున్నాయి.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం
ఒకప్పుడు రాజకీయాలు హందాగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి కొందరు నేతలు తిలోదకాలు ఇచ్చారు. ప్రజలు రెచ్చగొట్టే పద్దతిని అలవర్చుకున్నారు. దీనివల్ల సమాజంలో లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
శనివారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన చేశారు. ఇతర మతాలను కించపరిచకుండా ఉండేలా కొత్త చట్టం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ చివర లేదా, బడ్జెట్ సమావేశాలు ఈ చట్టం అసెంబ్లీకి రానుంది. ఆ లోపు కొత్త చట్టం రెడీ అవుతోంది.
హందా రాజకీయాలకు ప్రభుత్వం శ్రీకారం
జూబ్లీహిల్స్ బైపోల్‌లో సోషల్‌మీడియాలో రకరకాలుగా ప్రచారాలు సాగాయి. ఒకానొకదశలో మతాలను ప్రచారంలోకి లాగేశారు కొందరు నేతలు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ అయ్యింది. పరిస్థితి గమనించిన సీఎం, ఈ ప్రకటన చేశారని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని అంటున్నారు. సమాజ శాంతికి అవసరమన్నది ప్రభుత్వ వాదన. ఈ చట్టం అమలైతే తెలంగాణలో మత సామరస్యం మరింత బలపడుతుందని అంటున్నారు.
ALSO READ: మేడారం మహాజాతర-2026, పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్
కర్ణాటకలో ఇటీవల ఈ తరహా చట్టం ఒకటి అమల్లోకి వచ్చింది. హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్-ప్రివెన్షన్ బిల్ 2025 వచ్చింది. డిసెంబర్ 18న ఈ బిల్లు పాసైంది. దేశంలో ఆ తరహా చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం కర్ణాటక. దీనివల్ల మతం, కులం, లింగం, భాష, వికలాంగులపై రెచ్చగొట్టే మాటలు, రాతలు, డిజిటల్ కంటెంట్‌ని నిరోధించవచ్చు.
సోషల్ మీడియా, వెబ్‌సైట్ల నుంచి హేట్ కంటెంట్‌ని ప్రభుత్వం తొలగించే అధికారం ఉంది. ఆ తరహా నేరాలకు పాల్పడేవారికి తొలిసారి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధిస్తారు. మళ్లీ అలాంటి నేరానికి పాల్పడితే రెండేళ్ల నుంచి 10 ఏళ్లు జైలు, లక్ష జరిమానా. సోషల్ మీడియాను మానిటర్ చేయడానికి ప్రత్యేకంగా పోలీస్ బృందం రానుంది. ఆ చట్టాన్ని పరిశీలించిన తర్వాత పలు మార్పులు చేర్పులు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.