BigTV English

Hezbollah Commander Killed: ఇజ్రాయెల్ మెరుపుదాడులు, హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం!

Hezbollah Commander Killed: ఇజ్రాయెల్ మెరుపుదాడులు, హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం!

Hezbollah Commander Killed: ఇజ్రాయెల్-గాజా వార్ క్లయిమాక్స్‌కు చేరినట్టేనా? ఇజ్రాయెల్ పంతం నెగ్గిందా? హిజ్బుల్లా టాప్ కమాండర్ హతమయ్యాడా? ఈ వార్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టేనా? ఇవే ప్రశ్నలు పలు దేశాలను వెంటాడుతున్నాయి.


గాజాలో హిజ్బుల్లా మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బీరుట్‌‌లో జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బులా టాప్‌ కమాండర్‌ ఫువాద్‌ షుక్ర్‌ను హత మార్చినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఇటీవల సాకర్ మైదానంలో జరిగిన దాడుల్లో 12 మంది చిన్నారుల మరణాలకు కారకుడు పువాద్ అని తెలిపింది. గాజాతో వార్ మొదలైనప్పటి నుంచి హిజ్బుల్లా దాడులకు పువాద్ నాయకత్వం వహించాడు.

పువాద్ షుక్ర్‌‌పై అమెరికాలో గతంలో రివార్డు ప్రకటించింది. లెబనాన్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో సుదీర్ఘం గా పనిచేస్తున్నాడు పువాద్ షుక్ర్. అంతేకాదు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి కూడా. అయితే 1983లో బీరుట్‌ లో అమెరికా మెరైన్‌ కార్ప్స్‌ బ్యారక్స్‌పై దాడిలో ఫువాద్ కీలకపాత్ర పోషించాడు. ఆ ఘటనలో 24 మంది అమెరికా సైనికులు మరణించారు. షుక్ర్ గురించి సమాచారం ఇస్తే ఐదు మిలియన్లు రివార్డు ఇస్తామని గతంలో అమెరికా ప్రకటించిన విషయం తెల్సిందే.


ALSO READ: బ్రిటన్​లో ఉన్మాది దాడి, ముగ్గురు చిన్నారులు మృతి, పలువురి పరిస్థితి విషమం

ఇజ్రాయెల్ ప్రకటనను హెజ్బుల్లా వర్గాలు తోసిపుచ్చాయి. షుక్ర్‌‌కు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపాయి. ఆయన్ని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రాణాలతో బయటపడ్డాడని గుర్తు చేసింది. మరోవైపు ఇరాన్ మద్దతు గల ఉగ్రవాదులకు గట్టి పట్టున్న ప్రాంతం. అయితే ఇజ్రాయెల్ ఆక్ర్మిత గోలన్ హైట్స్‌లో దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని లెబనాన్ పేర్కొంది.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×